Bitter Gourd: మనలో చాలామంది కాకరకాయను ఇష్టపడరనే సంగతి తెలిసిందే. కాకరకాయ రుచి చేదుగా ఉంటుంది కాబట్టి ఎక్కువమంది కాకరకాయ తినడానికి అస్సలు ఇష్టపడరు. అయితే కాకరకాయ తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. డయాబెటిస్ తో బాధపడే వాళ్లు కాకరకాయ తినడం ద్వారా షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

కాకరకాయలో ఉండే చార్న్‌టిన్ పెప్‌టైడ్లు, ఆల్కలైడ్లు రక్తంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో తోడ్పడతాయి. శ్వాస సంబంధిత సమస్యలతో పాటు దగ్గు, బ్రాంకైటిస్, ఆస్తమా సమస్యలకు చెక్ పెట్టడంలో కాకరకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. చర్మ, రక్త సంబంధిత సమస్యలతో బాధపడే వాళ్లు కాకరకాయ తినడం ద్వారా ఆ సమస్యలను దూరం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: కాంగ్రేసేతర కూటమికి బీజం..? కేసీఆర్, స్టాలిన్ కు మమత ఫోన్
కాకరకాయ యాంటీఆక్సిడెంట్ గుణాలతో పాటు యాంట్రీ మైక్రోబియాల్ గుణాలను కలిగి ఉండటం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కాకరకాయ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. శరీరంలో టాక్సిన్లను తొలగించడంలో కాకరకాయ తోడ్పడుతుందని చెప్పవచ్చు. కాకరకాయ ఇమ్యూనిటీ పవర్ ను పెంచి రోగాలను రాకుండా చేస్తుంది.
కాలాలతో సంబంధం లేకుండా అన్ని కాలాలలో కాకరకాయతో చేసిన వంటకాలను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. కాకరకాయను కూరలా చేసినా, ఫ్రై చేసినా, జ్యూస్ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కాకరకాయ తినడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. బరువు తగ్గాలని అనుకునే వారు కాకరకాయను తరచూ తీసుకుంటే మంచిది. వైద్యులు సైతం కాకరకాయను తరచూ తీసుకోవాలని సూచనలు చేస్తుండటం గమనార్హం.
Also Read: కేసీఆర్ పైనా బీజేపీది అదే సర్జికల్ స్ట్రైక్