Health Tips: నేటి కాలంలో మొబైల్ తప్పనిసరిగా మారింది. విద్యార్థుల నుంచి బడా ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరూ మొబైల్ వాడకుండా రోజు గడవడం లేదు. కొందరు ఫోన్ తోనే డబ్బులు సంపాదిస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇలా మొబైల్ ఎన్నో అవసరాలు తీరుస్తున్నా.. అంతేస్థాయిలో కొత్త రోగాలను తీసుకొస్తుంది. కొందరు ఈ గాడ్జెట్ ను సమయం, సందర్భం లేకుండా వాడుతున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు చూస్తూ.. ఉదయాన్నే ఫోన్ చూసిన తరువాతే మిగతా పనులు చేస్తున్నారు. ఉదయాన్నే ఇలా మొబైల్ చూడడం వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే మరోసారి ఫోన్ ముట్టలేరని కొందరు వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ ఉదయమే మొబైల్ చూస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం..
ఐడీసీ రీసెర్చ్ ప్రకారం 80 శాతం మంది ఉదయం లేవగానే ఫోన్ చూసే అలవాటు ఉందని తేల్చారు. ఇలా ఉదయమే ఫోన్ చూడడం వల్ల ప్రధానంగా కళ్లపై ప్రభావం పడుతుంది. మొబైల్ నుంచి వెలువడే బ్లూ లైట్ కళ్లను దెబ్బ తీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. మొబైల్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ ప్రకారం.. ఫోన్ నుంచి వెలువడే బ్లూ లైట్ కళ్లపై ఒత్తిడిని కలిగిస్తుంది.
సాధారణంగా వయసు పైబడిన వారి కళ్లు మాక్యులర్ డీజెనరేషన్ సమస్యకు గురవుతాయి.కానీ ఉదయమే మొబైల్ చూసేవారి కళ్లు వీరిలాగా తొందరగా రెటీ సమస్యకు గురవుతాయి. అంతేకాకుండా కొందరు ఉదయమే మొబైల్ ఆన్ చేసిన తదేకంగా చూస్తారు. ఏదేని వస్తువు చూసేటప్పుడు 15 సార్లు కళ్ల రెప్పలు కొట్తాలని వైద్యులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కళ్లపై ప్రభావం ఉండదని అంటున్నారు. సాధారణంగా వచ్చే కళ్ల సమస్యల కన్నా ఉదయం ఫోన్ చూసేవారు తొందరగా రెటీనా సమస్యలకు గురవుతారని అంటున్నారు.
ఫోన్ నుంచి వెలువడే బ్లూ లైట్ శరీరంలోని మెలటోనిన్ స్థాయిని పెంచుతుంది. ఇది పరమితి కంటే ఎక్కువగా ఉంటే నిద్రపై ప్రభావం చూపుతుంది. నిద్ర కరువవడంతో హర్మోన్లపై ప్రభావం చపుతాయి. నిద్రచక్రంలో మార్పులు వచ్చి సరైన సమయంలో నిద్ర పట్టకుండా చూస్తుంది. నిద్రపోయేటప్పుడు ఫోన్ చూడడం వల్ల రెటీనాలోని ఫోటోరిసెప్టర్ కణాల నుంచి వెలువడే బ్లూ లైట్ గ్రహించి నిద్రపట్టకుండా చూస్తుంది. ఫలితంగా అనారోగ్యానికి గురవుతారు. అందువల్ల ఉదయం లేవగానే ఫోన్ చూసే అలవాటు మానుకోవాలి.