Shane Warne: ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ మృతి క్రికెట్ ప్రపంచాన్ని ఎంతలా కుదిపేసిందో అందరికీ తెలిసిందే. 52 ఏళ్లకే షేన్ వార్న్ ఇలా మృతి చెందడం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఎంతో ఫిట్ గా ఉండే వార్న్ ఇలా గుండెపోటుతో మృతి చెందడంపై ఇప్పటికే అనేక అనుమానాలు తెరమీదికి వస్తున్నాయి. కాగా ఇప్పుడు వార్న్ మేనేజర్ జెమ్స్ ఏర్స్కిన్ కొన్ని సంచలన నిజాలు బయట పెట్టాడు.

వార్న్ మృతికి అతను తీసుకున్న నిర్ణయమే కారణమని అని అంటున్నాడు జేమ్స్. బరువు తగ్గాలనే ఉద్దేశంతో అతను చాలా కఠినమైన డైట్ ను ఫాలో అవుతాడని, అతను చనిపోకముందు 14 రోజుల ముందు వరకు కేవలం ద్రవపదార్థం రూపంలో ఉన్న డైట్ ను తీసుకుంటున్నాడని వివరించాడు. దాంతో పాటు చాలా కఠినమైన వ్యాయామాలు కూడా చేస్తున్నాడని జేమ్స్ పేర్కొన్నాడు.
అయితే థాయిలాండ్ పోలీసుల విచారణలో వార్న్ రూమ్ లో బెడ్ మీద, టవల్ కి రక్తపు మరకలు ఉండటం సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. దీంతో అనేక అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి. గుండెపోటు వచ్చిన వ్యక్తికి రక్తం ఎలా బయటకు వచ్చింది అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఈ అనుమానాల నేపథ్యంలోనే ఇప్పుడు జేమ్స్ చెప్పిన మాటలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ అధికార వెబ్ సైట్ కు జేమ్స్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఇందులో వార్న్ తీసుకుంటున్న కఠిన డైట్ ఆయన మరణానికి కారణం అవుతుందని తాను అంతకుముందు గుర్తించలేకపోయానని బాధపడ్డాడు. కాగా వార్న్ కొంత కాలం కిందట చేసిన పోస్ట్ కూడా ఇప్పుడు జేమ్స్ వ్యాఖ్యలను బలపరుస్తోంది. పది రోజుల కిందట సర్జరీ మొదలైందని త్వరలోనే పాతకాలం వార్న్ ను మీరు చూస్తారు అంటూ ఇంస్టాగ్రామ్ లో గతంలో ఎంతో ఫిట్ గా ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ పోస్ట్ చేశాడు. దాన్ని బట్టి చూస్తుంటే వార్న్ బరువు తగ్గడానికి ఎంత కఠినమైన డైట్ ను ఫాలో అయ్యాడు అర్థమవుతుంది.