https://oktelugu.com/

Sexual Health: లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఫుడ్స్ ఏంటో మీకు తెలుసా?

లైంగిక ఆరోగ్యాన్ని కాపాడటానికి కొన్ని ఆహార పదార్థాలను తప్పకుండా చేర్చుకోవాలి. మరి ఆ పదార్థాలేంటో తెలియాలంటే ఈ ఆర్టికల్ మొత్తం చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 14, 2024 6:14 pm
    Banana Benefits

    Banana Benefits

    Follow us on

    Sexual Health: శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు లైంగిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. లైంగికంగా ఆరోగ్యంగా ఉండటం వల్ల కొన్ని అనారోగ్య సమస్యల బారి నుంచి తప్పించుకోవచ్చని వైద్య నిపుణలు చెబుతున్నారు. సాధారణంగా వయస్సు పెరిగే కొలది లైంగిక ఆసక్తి తగ్గిపోతుంది. కానీ వయస్సులో ఉన్నప్పుడు కూడా లైంగికంగా ఆసక్తి లేదంటే ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ రోజుల్లో అయితే ఎక్కువ శాతం మంది ఒత్తిడికి గురవుతున్నారు. దీర్ఘకాలికంగా ఒత్తిడికి గురైతే లైంగిక ఆసక్తి కోల్పోతారని నిపుణులు అంటున్నారు. ఇలాంటి సమస్యల నుంచి తప్పించుకోవాలంటే తప్పకుండా ఆహార అలవాట్లు మార్చాలి. పోషకాలు ఉండే సరైన ఆహారం తీసుకోవాలి. అయితే లైంగిక ఆరోగ్యాన్ని కాపాడటానికి ఇప్పుడు చెప్పే పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. మరి అవేంటో తెలియాలంటే ఆర్టికల్ మొత్తం చదివేయండి.

     

    లైంగిక కోరికలపై ఆసక్తి తగ్గుతుంటే ఆహారంలో తప్పకుండా కొన్ని పదార్థాలు చేర్చుకోవాలి. ముఖ్యంగా ఆహారంలో అరటి పండ్లు చేర్చుకోవాలి. ఇవి లైంగిక ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. ఇందులో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇవి ఒత్తిడిని తగ్గించి లైంగిక పనితీరును మెరుగుపరుస్తుంది. అరటి పండులో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ పురుషుల్లో లైంగిక ఆసక్తిని ఎక్కువగా పెంచుతుందట. రోజుకి ఒకటి నుంచి రెండు అరటి పండ్లను తినడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు లైంగిక కోరికలు కూడా పెరుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మద్యపానం, ధూమపానం వంటివి కూడా అధికంగా తీసుకోవడం వల్ల లైంగిక కోరికలు తగ్గుతాయి. ఎక్కువగా తీసుకుంటే కొన్నిసార్లు ఆందోళన, అనారోగ్య సమస్యల బారిన పడతారు. దీంతో లైంగిక కోరికలపై ఆసక్తి తగ్గుతుంది. లైంగికంగా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

     

    డైలీ పెరుగును తినడం వల్ల లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెరుగులోని ప్రోబయోటిక్స్ లైంగిక ఆసక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పెరుగు, అరటి పండును కలిపి తినడం వల్ల ఫలితం ఉంటుంది. పెరుగు కేవలం లైంగిక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా పేగు, జీర్ణక్రియ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. పెరుగులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి శక్తి ఇవ్వడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఇందులోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా బాగా ఉపయోగపడుతుంది. అయితే పెరుగు, అరటి పండును కలిపి తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు కలిపి వీటిని తినకపోవడం మంచిది. సాధారణంగా వీటిని వేర్వేరుగా తిన్న బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.