Homeలైఫ్ స్టైల్Zangbeto voodoo dance: డప్పు కొడితే చాలు.. గడ్డి కుప్పల నుంచి వింత ఆకారాలు.. ఇది...

Zangbeto voodoo dance: డప్పు కొడితే చాలు.. గడ్డి కుప్పల నుంచి వింత ఆకారాలు.. ఇది మామూలు థ్రిల్లర్ కాదు భయ్యా

Zangbeto voodoo dance: మన ఏరియాలో పక్వానికి వచ్చిన వరి కోసిన తర్వాత.. గడ్డిని వాములుగా పేర్చుతారు. ఆ తర్వాత వాటిని పశువులకు వేస్తుంటారు. మనకు ఆహారం ఎలా అయితే శక్తి ఇస్తుందో.. వరిగడ్డి కూడా పశువులకు అదే స్థాయిలో శక్తిని అందిస్తుంది. వరిగడ్డిని మన ప్రాంతంలో పశువులకు మాత్రమే కాకుండా.. ఎండ వేడిమి తగలకుండా కొట్టాలు (పశువుల పాకలు), గుడిసెలు, మంచెలు వంటి వాటికి ఉపయోగిస్తారు.

వరిగడ్డిని నైజీరియా దేశంలో మాత్రం మరో పనికి ఉపయోగిస్తారు. ఇక్కడ గడ్డి కుప్పలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఈ గడ్డి కుప్పల చుట్టూ డబ్బులు కొడతారు. అలా కొట్టడం వల్ల తమ పూర్వీకుల ఆత్మలు ఆ గడ్డి కుప్పలలోకి చేరుతాయని నమ్ముతారు. గడ్డిని తిరిగేసి చూసినా సరే లోపల మొత్తం ఖాళీగానే ఉంటుందని వారు చెబుతుంటారు. వీటిని జాంగ్ బెటో అని పిలుస్తుంటారు. పక్వానికి వచ్చిన వరిని కోసిన తర్వాత.. ఆ గడ్డిని చాలా రోజులపాటు ఎండబెడతారు. ప్రత్యేకమైన దారాలతో కట్టలుగా కడతారు. ఆ తర్వాత తమకు నచ్చిన రూపాలలో వాటిని పేర్చుతూ ఉంటారు. ఆ గడ్డి కట్టల చుట్టూ ఊరంతా డబ్బులు కొడుతుంటారు. అలా కొట్టినప్పుడు తమ పూర్వీకుల ఆత్మలు అందులో చేరుతాయని నమ్ముతుంటారు.

గ్రామాలను వేధించే దొంగలు.. దుష్టశక్తుల నుంచి గడ్డి కుప్పలలో ఉన్న పూర్వీకుల ఆత్మలు కాపాడతాయని ప్రజలు భావిస్తుంటారు. వీటిని లివింగ్ గోస్ట్ అని పిలుస్తుంటారు. అయితే గడ్డి కుప్పలలో చేరిన తర్వాత.. వాటిని తిరిగేసి చూసినా సరే ఖాళీగా కనిపించడం ఇప్పటికి మిస్టరీగానే ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో స్థానికులు ఇప్పటికీ బయటకి చెప్పరు. పైగా ఆ రహస్యాన్ని తమలోని ఉంచుకుంటారు.

నైజీరియా ప్రాంతంలో ఎవరైనా చనిపోతే చేసే అంత్యక్రియలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. వారు ప్రతి క్రతువులో కూడా తమ సంప్రదాయాన్ని పాటిస్తుంటారు.. డబ్బులు కొట్టి తమ సంస్కృతిని ప్రదర్శిస్తుంటారు. తమ సంప్రదాయాన్ని చాటి చెబుతూ ఉంటారు. ఈ గడ్డి కుప్పలలో ఉన్న ఆత్మల వ్యవహారం నైజీరియా ప్రాంతానికి సరికొత్త గుర్తింపును తీసుకొస్తూ ఉంటుంది. అయితే పర్యాటకులు మాత్రం ఆ గడ్డి కుప్పల దరిదాపుల్లోకి వెళ్లడానికి ఇష్టపడరు. ఏది ఏమైనాప్పటికీ గడ్డి కుప్పల్లో ఉన్న ఆత్మలు డప్పు కొడితే చాలు అందులోకి చేరడం చాలా వింతగా ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version