https://oktelugu.com/

Sea Fish: సముద్రపు చేపలా? చెరువు చేపలా? రెండింటిలో ఏది మంచిది?

ఆరోగ్యానికి చేపలు ఎంతో మేలు చేస్తాయనే విషయం తెలిసిందే. వీటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే కొందరికి చెరువు చేపలు ఎక్కువగా దొరికితే.. మరికొందరికి సముద్రపు చేపలు దొరుకుతాయి. మరి ఆరోగ్యానికి చెరువు చేపలా? సముద్రపు చేపలా? రెండింట్లో ఏవి ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 18, 2024 / 03:45 PM IST

    Sea Fish

    Follow us on

    Sea Fish: ఆరోగ్యానికి చేపలు ఎంతో మేలు చేస్తాయనే విషయం తెలిసిందే. వీటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే కొందరికి చెరువు చేపలు ఎక్కువగా దొరికితే.. మరికొందరికి సముద్రపు చేపలు దొరుకుతాయి. గ్రామాల్లో ఉన్నవారు ఎక్కువగా చెరువు చేపలనే తింటారు. అయితే ఈ రెండింట్లో ఆరోగ్యానికి ఏ చేపలు మంచివే అనే విషయం ఎవరికి సరిగ్గా తెలియదు. చేపలు ఆరోగ్యానికి మంచివని తెలిసిన కూడా కొందరు తక్కువగా తింటారు. దీని కంటే చికెన్‌ను ఇష్టంగా తింటారు. ఇందులో ప్రొటీన్ ఎక్కువగా ఉన్న కూడా ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయితే కొందరు ఏ చేపలో కూడా తెలియక తింటారు. ఇప్పుడంటే ఐస్ చేపలు ఎక్కువగా ఉంటున్నాయి. తాజా చేపలు దొరకడమే కష్టం అయిపోయింది. ఎక్కువ రోజులు చేపలు ఉండటానికి ఐస్‌ బాక్స్‌లో ఉంచి రవాణా చేస్తారు. ఇవి తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. మరి ఆరోగ్యానికి చెరువు చేపలా? సముద్రపు చేపలా? రెండింట్లో ఏవి ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం.

     

    సముద్రపు చేపలా.. చెరువు చేపలా.. అంటే సీ ఫీష్‌ ఆరోగ్యానికి మంచివని వైద్య నిపుణులు చెబుతున్నారు. సముద్రపు చేపలు రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని అంటున్నారు. సముద్రపు చేపల్లో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. సముద్రపు చేపలతో పోలిస్తే చెరువు చేపల్లో ఆమ్లాలు తక్కువగా ఉంటాయి. అలాగే సముద్రపు చేపల్లో విటమిన్ డి ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సముద్రపు చేపలు బాగా ఉపయోగపడతాయి. సముద్రంలో అన్ని రకాల చేపలను తినడం ఆరోగ్యానికి మంచిదే. సముద్రపు చేపల్లోని సెలీనియం ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కల్పించడంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. కనీసం వారానికి ఒకసారి చేపలను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాలు రాకుండా కూడా ఉంటాయి.

     

    సముద్రపు చేపలు తినడం వల్ల కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కళ్ల సమస్యలు రాకుండా చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. కొందరికి రేచీకటి ఉంటుంది. ఈ సమస్య రాకుండా చేయడంలో సముద్రపు చేపలు బాగా ఉపయోగపడతాయి. కేవలం శారీరక సమస్యలే కాకుండా మానసిక సమస్యలను తగ్గించడంలో కూడా ఈ చేపలు ప్రధాన పాత్ర వహిస్తాయి. మానసిక ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడి వాటి నుంచి విముక్తి పొందడంలో సముద్రపు చేపలు బాగా సాయపడతాయి. వీటిని తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు మతి మరుపు తగ్గుతుంది. ఈ చేపల వల్ల స్కిన్ కూడా మారుతుంది. చర్మంపై ఎలాంటి ముడతలు రాకుండా యంగ్‌ లుక్‌లో ఉండేట్లు చేస్తాయి. అలాగే సూర్యరశ్మి నుంచి వచ్చే కిరణాల నుంచి చర్మం నల్లగా మారకుండా ఉంచుతుంది. కాబట్టి వీలైతే వారానికి ఒకసారి అయిన సముద్రపు చేపలను తినడం అలవాటు చేసుకోండి. దీనివల్ల శారీరకంగా, మానసికంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.