https://oktelugu.com/

SBI MCLR: వినియోగదారులకు షాకిచ్చిన ఎస్.బీఐ

ఖాతాదారులకు అనుగుణంగా ఎస్బీఐ రకరకాల సేవలను అందిస్తోంది. దీంతో ఈ బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్లు విపరీతంగా పెరిగాయి. మరోవైపు అర్హులైన ఖాతాదారులకు వివిధ రకాల లోన్లు కూడా ఇస్తుంది. అయితే తాజాగా ఈ బ్యాంకు ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేట్ (MCLR ) రేట్ ను పెంచినట్లు ప్రకటించింది.

Written By:
  • Srinivas
  • , Updated On : July 15, 2023 / 10:16 AM IST

    SBI MCLR

    Follow us on

    SBI MCLR: భారతీయ బ్యాంకుల్లో మిగతా వాటికంటే అత్యధిక ప్రాధాన్యం కలిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI). ప్రభుత్వ రంగ దిగ్గజం అయిన ఈ బ్యాంకులో దేశ వ్యాప్తంగా కోట్లాదిమంది ఖాతాదారులను కలిగి ఉంది. నిత్యం కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ తో బిజీగా ఉంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకు అయినందున సెక్యూరిటీ పర్పస్ లో చాలా మంది వినియోగదారులు ఎస్బీఐ వైపే మొగ్గు చూపుతారు.

    ఖాతాదారులకు అనుగుణంగా ఎస్బీఐ రకరకాల సేవలను అందిస్తోంది. దీంతో ఈ బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్లు విపరీతంగా పెరిగాయి. మరోవైపు అర్హులైన ఖాతాదారులకు వివిధ రకాల లోన్లు కూడా ఇస్తుంది. అయితే తాజాగా ఈ బ్యాంకు ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేట్ (MCLR ) రేట్ ను పెంచినట్లు ప్రకటించింది.

    మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేట్ (MCLR ) ను 5 బేసిస్ పాయింట్లు పెంచినట్లు బ్యాంకు తెలిపింది. పెంచిన ఈ రేట్లు శనివారం (జూలై 15) నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. దీంతో MCLRతో అనుసంధానమైన అన్ని రకాల రుణాలపై వడ్డీ రేటు పెరగనుంది. ఒక్కరోజు, నెల, ఆరు నెలలలు, ఏడాది లMCLR కు ఇది వర్తిస్తుందని తెలిపింది. అంటే పర్సనల్ లోన్ నుంచి హోమ్ లోన్ తీసుకున్న వారు నెలనెలా చెల్లించే ఈఎంఐలో పెరుగుదల ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

    MCLRను ఏ లోన్లకైనా వడ్డీ రేట్లను నిర్ణయించేందుకు దీనిని ప్రామాణికంగా తీసుకుంటాయి. సందర్భానుసారంగా బ్యాంకులు దీని పాయింట్లను పెంచుతూ వస్తున్నారు. ఇలా పాయింట్లు పెరగడం వల్ల రుణాలపై వడ్డీ భారం అధిగమవుతుంది. తాజాగా పెంచిన రేట్ ప్రకారం ఏడాది కాలపరిమితి కలిగిన MCLR 8.50 శాతం నుంచి 8.55 పెరగనుంది. ఆరు నెలల వాటికి 8.45, రెండు సంవత్సరాల వాటికి 8.65 శాతం పెరగనుంది. అయితే ఎస్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల మిగతా బ్యాంకులు ఎలాంటి రెస్పాన్స్ ను ఇస్తాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.