Satyanasi flowers: మన చుట్టూ ఎన్నో రకాలు మొక్కలు పెరుగుతుంటాయి. కాకపోతే వీటిని చూసి మనం పిచ్చి మొక్కలు అనుకుంటాం. కానీ ఇందులో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. మనం డైలీ చూస్తున్న కూడా అవి మనకి పనికి రాని మొక్కలుగా కనిపిస్తాయి. అలాంటి వాటిలో సత్యనాశి ఒకటి. చాలామంది ఈ మొక్క పనికి రాదని భావిస్తారు. కానీ ఈ మొక్క చేసే ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ఈ మొక్కను ఆయుర్వేదానికి కూడా ఉపయోగిస్తారట. ఈ మొక్కలో ఔషధ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ మొక్క పువ్వుల పసుపు రంగులో ఉంటాయి.
చిన్న కాండంతో ఉన్న ఈ మొక్కల నుంచి పసుపు పాలలాంటి ద్రవం వస్తుంది. ఈ మొక్క పువ్వులు, కాండం, బెరడు, అన్నింటిని కూడా ఆయుర్వేదానికి ఉపయోగిస్తారు. ఈ మొక్కలోని అన్ని భాగాలను కూడా ఔషధానికి ఉపయోగిస్తారు. ఈ పువ్వు విత్తనాలు చూడటానికి ఊదా రంగులో ఉంటాయి. ఇవి ఎక్కువగా బంజరు భూమిలో రోడ్డు పక్కన పెరుగుతాయి. వీటితో ఎలాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొవడంలో బాగా ఉపయోగపడతాయి. మీ ఇంటి చుట్టూ ఈ మొక్కలు కనిపిస్తే అసలు వదలవద్దు. దీనివల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు జుట్టుని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
సత్యనాశి మొక్కలో యాంటీ మైక్రోబయల్, యాంటీ డయాబెటిక్, అనాల్జేసిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు వంటి గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడతాయి. అలాగే యాంటీ వాపును తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఈ మొక్కలతో జీర్ణ వ్యవస్థ మెరుగుపడటంతో పాటు గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. వీటితో పాటు దద్దుర్లు, మంట, దురద వంటి చర్మ సంబంధిత సమస్యలను నయం చేయడంలో కూడా ఈ మొక్క బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే ఈ మొక్కలను గుర్తు పట్టడం చాలా కష్టం. ఎందుకంటే కొందరు ఈ మొక్క ఎలా ఉందో తెలియదు.
ఈ మొక్కను 2000 సంవత్సరాల నుంచి ఆయుర్వేదానికి ఉపయోగిస్తున్నారు. ఇందులో క్యాన్సర్, హెచ్‌ఐవీని నివారించడంలో కూడా బాగా పనిచేస్తుంది. ఇందులో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, గ్లైకోసైడ్స్, టెర్పెనాయిడ్స్, ఫినోలిక్స్ వంటి సెకండరీ మెటాబోలైట్స్ కూడా ఉన్నాయి. ఇవి ఆరోగ్యంగా ఉంచడంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ మొక్క ద్వారా దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా బయట పడవచ్చు. ఇందులోని ఔషధ గుణాలు క్యాన్సర్ కణాలను నిరోధించడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటిని ఉపయోగించి అన్ని రకాల వ్యాధులను కూడా నిరోధించవచ్చు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.