https://oktelugu.com/

Satya Nadella: హైదరాబాద్ కుర్రాడు.. రూ.450 కోట్ల జీతం.. ఎవరో తెలుసా?

మనం నిత్యం వినే సత్యం నాదేళ్ల గురించే. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మైక్రోసాఫ్ట్ సీఈవోగా కొనసాగుతున్న సత్యం నాదేళ్ల గురించి పూర్తి వివరాల్లోకి వెలితే.. 1967లో హైదరాబాద్ లో జన్మించారు. నగరంలోని పబ్లిక్ స్కూల్ లో చదివిన ఆయన కర్ణాటకలోని మణిపాల్ ఇనిస్టిట్యూట్ లో ఇంజనీరింగ్ టెక్నాలజీ పూర్తి చేశారు.

Written By:
  • Srinivas
  • , Updated On : July 15, 2023 / 12:19 PM IST

    Satya Nadella

    Follow us on

    Satya Nadella: తండ్రి ఐఏఎస్ ఆఫీసర్.. తనలాగే జీవితంలో కుమారుడు ఉన్నతంగా చదువుకోవాలని అనుకున్నాడు. దీంతో పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. తండ్రి ఇచ్చిన స్వేచ్చను అవకాశంగా తీసుకున్నాడు. చదువులో ఫస్ట్ నుంచే చురుగ్గా ఉన్నాడు. అతడి ప్రతిభ చూసి జీవితంలో ఏదో సాధిస్తాడని అనుకున్నారు. మరింతగా ఆకుర్రాడిని ప్రోత్సహించడంతో ఆయన విదేశాల్లో చదివాడు. ఆ తరువాత ఓ సంస్థలో చేరాడు. అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీకి సీఈవోగా మారాడు. హైదరాబాద్ కు చెందిన ఈ కుర్రాడి జీవితం అందరికీ ఆదర్శం. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా?

    మనం నిత్యం వినే సత్యం నాదేళ్ల గురించే. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మైక్రోసాఫ్ట్ సీఈవోగా కొనసాగుతున్న సత్యం నాదేళ్ల గురించి పూర్తి వివరాల్లోకి వెలితే.. 1967లో హైదరాబాద్ లో జన్మించారు. నగరంలోని పబ్లిక్ స్కూల్ లో చదివిన ఆయన కర్ణాటకలోని మణిపాల్ ఇనిస్టిట్యూట్ లో ఇంజనీరింగ్ టెక్నాలజీ పూర్తి చేశారు. ఆ తరువాత విస్కాన్సిన్ -మిల్వాకీ ఇనిస్టిట్యూట్ లో కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ తరువాత చికాగో యూనివర్సిటీ లో ఏంబీఏ పట్టా పొందాడు.

    ఇంజినీరింగ్ లో టాలెంట్ ఉన్న సత్యనాదేళ్ల 1992లో సన్ మైక్రోసిస్టమ్స్ లో మొదటిసారిగా కెరీర్ ప్రారంభించాడు. ఆ తరువాత రెండో సీఈవో గా బాధ్యతలు చేపట్టాడు. ఒక వైపు విండోస్, ఆఫీస్ వ్యాార విభాగాలు క్షీణిస్తున్న తరుణంలో సత్యనాదేళ్ల బాధ్యతలు చేపట్టారు. ఆయన ఆధ్వర్యంలో క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందింది. పలు అంతర్జాతీయ కపెనీల ఆధునాతన సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్ ల నిర్వహణకు ఇదే కీలకంగా మారింది. ఈ సమయంలో మైక్రోసాఫ్ట్ కొత్త సారధి సత్యనాదేళ్ల అని స్టివ్ బామర్ పేర్కొన్నారు. దీంతో 2014లోఆయన బాధ్యతలు చేపట్టారు.

    2013లో సత్యనాదేళ్ల నికర ఆదాయం 7.6 మిలియన్ డాలర్లు. ఇది 2016కు వచ్చేసరికి 84.5 మిలియన్ డార్లకు చేరింది. ఇక సత్యనాదేళ్ల సీఈవోగా ఉన్న మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రస్తుతం 2.5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ ను కలిగి ఉంది. దీంతో సత్యనాదేళ్ల నికర ఆదాయం విలులవ రూ.6,200 కోట్లుగా ఉంది. వార్షిక పరిహారం 54.9 ఉండగా.. భారత కరెన్సీ ప్రకారం సత్యనాదేళ్ల రూ.450కోట్లు ఏడాదికి సంపాదిస్తున్నారు.హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం పొందుతున్న సత్యనాదేళ్లను ప్రశంసించని వారు లేదరని చెప్పొచ్చు.