https://oktelugu.com/

Salt: వామ్మో ఈ ఉప్పు ధర ఇంతా? ప్రపంచంలోనే ఖరీదైనది ఇదే

గతంలో ఉప్పు (Salt) దొరకడం చాలా కష్టం. చాలా ఖరీదైనది (Costly) కూడా. కానీ ప్రస్తుతం ఈ ఉప్పు మనకు చాలా చౌకగా లభిస్తుంది. అయితే ఈ ఉప్పులో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కో దాని బట్టి ఒక్కో రేటు ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఉప్పు కూడా ఉంది. ఇంతకీ ఆ ఖరీదైన ఉప్పు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 26, 2025 / 09:00 AM IST
    Korean Salt

    Korean Salt

    Follow us on

    Salt: ఉప్పు లేకపోతే కూర రుచి కూడా ఉండదు. వండిన వంటలు టేస్టీగా (Tasty) రావాలన్నా, లేకపోతే తినాలనిపించాలన్నా కూడా ఉప్పు (Salt) అనేది తప్పనిసరి. అసలు ఉప్పు లేని ఇళ్లు అంటూ ఉండదు. వంటలు చేయాల్సిన వాళ్లే కాకుండా ప్రతీ ఒక్కరూ కూడా ఉప్పును (Salt) వాడుతారు. అయితే ఈ ఉప్పు సాధారణంగా తక్కువ రేటు ఉంటుంది. ఉప్పులో చాలా రకాలు ఉంటాయి. వీటిని ఒక్కోక్కరు ఒక్కోటి వాడుతుంటారు. గతంలో ఉప్పు (Salt) దొరకడం చాలా కష్టం. చాలా ఖరీదైనది (Costly) కూడా. కానీ ప్రస్తుతం ఈ ఉప్పు మనకు చాలా చౌకగా లభిస్తుంది. అయితే ఈ ఉప్పులో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కో దాని బట్టి ఒక్కో రేటు ఉంటుంది. అయితే ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఉప్పు కూడా ఉంది. ఇంతకీ ఆ ఖరీదైన ఉప్పు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

    ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఉప్పు కొరియన్ ఉప్పు. దీన్ని ప్రత్యేక పద్ధతుల్లో కొరియన్ వెదురుతో తయారు చేస్తారు. చేయబడింది. దీనిని కొరియన్ వెదురు ఉప్పు, ఊదారంగు వెదురు ఉప్పు, జుగ్యోమ్ అని కూడా అంటారు. ఈ ఉప్పు 250 గ్రాముల ధర 100 డాలర్లు ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.7500 రూపాయలు. ఈ కొరియన్ ఉప్పును పురాతన కాలం నుంచి వినియోగిస్తున్నారు. ఈ ఉప్పును వెదురు లోపల సాధారణ సముద్రపు ఉప్పు వేసి, అధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చి తయారు చేస్తారు. దీనిని అమెథిస్ట్ వెదురు అంటారు. దీన్ని కొరియాలో తయారు చేస్తారు. ఈ ఉప్పును తయారు చేయడానికి చాలా సమయం పడుతుందట. వెదురు సిలిండర్లలో నింపి నీలం వెదురు ఉప్పును తయారు చేయడానికి దాదాపుగా 50 రోజులు పడుతుంది. ఉప్పుతో నింపిన వెదురు సిలిండర్‌ను అధిక ఉష్ణోగ్రతల వద్ద చాలా సార్లు వేడి చేస్తే.. వెదురు లక్షణాలు ఉప్పులో కలిసిపోతాయి. దీన్ని 800 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కనీసం తొమ్మిది సార్లు కాల్చుతారు. చివరగా 1000 డిగ్రీల సెల్సియస్‌లో కాల్చుతారు. దీనివల్ల ఈ ఉప్పు ధర ఎక్కువగా ఉంటుంది.

    సాధారణ సముద్రపు ఉప్పుతో పోలిస్తే వెదురు ఉప్పులో ఇనుము, పొటాషియం, కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలు అధిక స్థాయిలో ఉంటాయి. ఈ ఖనిజాలు జీర్ణక్రియ, నోటి ఆరోగ్యా్న్ని మెరుగుపరుస్తాయి. అలాగే ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వాపును తగ్గిస్తాయి. ఆర్థరైటిస్, గొంతు నొప్పి సమస్యలను కూడా తగ్గిస్తుంది. నోటి పూతలు, చిగుళ్ల వాపు, బ్యాక్టీరియా వంటి ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది. ఇందులో అధికంగా pH స్థాయిలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అలాగే మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వెదురు ఉప్పు వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఒత్తిడి వంటి సమస్యలు తగ్గుతాయి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.