MSG health risks men: ఇంట్లో ఎంతో రుచికరమైన ఆహారం వండిన.. పొరుగింటి కూరే పుల్లన.. అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అంటే ఇంట్లో వండిన దానికంటే బయట దొరికే ఆహారం కోసమే ఆరాటపడుతూ ఉంటారు. ఇలాంటి వారు రోజు రోజుకు పెరుగుతుండడంతో స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఈ స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు ఒకప్పుడు పట్టణాలు, నగరాల్లో మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు గ్రామాలకు కూడా పాకాయి. అయితే వీటిలో ఆహారం తిన్న వారు ఎన్నో రకాలుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వీరు తినే ఆహారంలో MSG ఉంటుంది. మరి దీనివల్ల ఎటువంటి నష్టం కలుగుతుందంటే?
మనం రోజు తినే ఆహారానికి బదులు ఇతర ఆహారం రుచి చూడాలని చాలామంది అనుకుంటారు. ఈ క్రమంలో ఎక్కువగా చైనీస్ ఫుడ్ తినాలని ఆశపడతారు. చైనీస్ ఫుడ్ లో నూడుల్స్, మంచూరియా వంటివి ఉంటాయి. ఇవి ఎవరు చేసినా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో టేస్టీ పౌడర్ కలుపుతారు. ఆ టేస్టీ పౌడర్ Mono Sodium Glutamate. ఇది కలిపిన పదార్థాలను తరచుగా తింటే ముందుగా మతిమరుపు వస్తుంది. ఆ తర్వాత నెలలకొద్దీ తింటూ ఉంటే.. అల్జిమర్స్ వ్యాధి వస్తుంది. దీంతో అప్పటి విషయాన్ని అప్పుడే మర్చిపోవడం.. కొన్ని విషయాలు అసలు గుర్తుకు రాకపోవడం వంటి సమస్యలు ఉంటాయి.
మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ MSG అనేది పురుషుల్లో ఫెర్టిలిటీ కౌంట్ ను తగ్గించే అవకాశాలు ఉన్నాయని కొందరు వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంటే సంతానం కోసం ఎదురుచూసే పురుషులు లేదా మహిళలు ఈ రకమైన టేస్టీ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల వారిలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల సంతానం కోసం ప్లాన్ చేసుకునేవారు ఇలా బయట ఫుడ్ జోలికి పోకుండా ఉండడమే మంచిది. లేకుంటే దీని ప్రభావం పడి ఆలస్యంగా ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
చిన్నపిల్లలు ఎక్కువగా ఎం ఎస్ జి కలిపిన పదార్థాలను తినడం వల్ల మతిమరుపు ఎక్కువగా వస్తుంది. దీంతో వారు చదువుపై దృష్టి పెట్టలేరు. స్కూల్లో చెప్పిన పాఠాలు గుర్తుపెట్టుకోలేక.. ఇంటికి వచ్చి ఇబ్బంది పడతారు. అంతేకాకుండా తల్లిదండ్రులు చెప్పే కొన్ని మాటలను కూడా వారు మర్చిపోతుంటారు. ఇలా చిన్నప్పుడు అల్జీమర్స్ వ్యాధికి గురై పెద్దయ్యాక మరింత సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందువల్ల సాధ్యమైనంతవరకు టేస్టీ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. వీటికి బాధలు ప్రత్యామ్నాయంగా ఫ్రూట్స్ లేదా ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి.