https://oktelugu.com/

Romantic Mood: ఈ ఫుడ్స్ రొమాంటిక్ మూడ్ ను తెప్పిస్తాయి.. అవెంటో తెలుసా?

ముఖ్యంగా రాత్రిళ్లు పార్ట్ నర్ తో సంతోషంగా ఉండడానికి మనసు ప్రశాంతంగా ఉండాలి. ఈ ప్రశాంతత రావడానికి కూడా కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయని అంటున్నారు కొందరు వైద్య నిపుణులు.

Written By:
  • Srinivas
  • , Updated On : February 16, 2024 10:09 am
    Romantic Mood food

    Romantic Mood food

    Follow us on

    Romantic Mood:  ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని వ్యాధులు నయం కావడానికి మెడిసిన్ తో పని లేకుండా నాణ్యమైన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. నేటి కాలంలో చాలా మంది ఏదో ఒక ఒత్తిడితో కలిగి ఉంటున్నారు. దీంతో జీవిత భాగస్వామితో సరైన సమయం వెచ్చించలేకపోతున్నారు. ముఖ్యంగా రాత్రిళ్లు పార్ట్ నర్ తో సంతోషంగా ఉండడానికి మనసు ప్రశాంతంగా ఉండాలి. ఈ ప్రశాంతత రావడానికి కూడా కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయని అంటున్నారు కొందరు వైద్య నిపుణులు. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రొమాంటిక్ మూడ్ లోకి వెళ్తారని అంటున్నారు. మరి ఆ ఫుడ్స్ ఏవో తెలుసుకుందాం..

    శరీరం యాక్టివ్ గా ఉండాలంటే మాంసాహారం ఎక్కువగా తీసుకోవాలని భావిస్తారు. ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడం వల్ల వీటిని తింటే రొమాంటిక్ మూడ్ లోకి వెళ్తామని కొందరు అనుకుంటారు. కానీ మాంసాహారం కంటే కూరగాయలతో చేసే భోజనం ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. కూరగాయలు ఎక్కువగా తినడం వల్ల టెస్టో స్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది మంచి మూడ్ లోకి తీసుకెళ్లెలా సహకరిస్తుంది. చిన్న పిల్లలకు చాక్లెట్ తినడం అంటే చాలా ఇష్టం. కానీ పెద్ద వారు కూడా డార్క్ చాక్లెట్ తినడం వల్ల రొమాంటిక్ మూడ్ లోకి వెళ్తారు.

    అవిసెగింజలను పలు పదార్థాల్లో ఉపయోగిస్తారు. వీటిపై అవగాహన లేకపోవడంతో దీని గురించి పట్టించుకోరు. కానీ రెగ్యులర్ గా వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పండ్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో బెర్రీ, స్ట్రాబెర్రీ పండ్లు మరింత శక్తి ఇస్తాయి. ముఖ్యంగా బెడ్ రూంల్లో ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఇవి ఎంతో సహకరిస్తాయి. సాధ్యమైనంత ఎక్కువగా వీటిని తీసుకోవడం వల్ల మేలే జరుగుతుంది. ఈ మధ్య ఆవకాడో పండును బాగా వినియోగిస్తున్నారు. అయితే పూర్తిగా మార్కెట్లోకి రాలేదు. దీనిని తీసుకోవడం వల్ల ఎనర్జీతో పాటు రొమాంటిక్ మూడ్ లోకి వస్తారు.

    రోజంతా ఎంత ఒత్తిడి ఉన్నా జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటేనే కటుంబం బాగుంటుంది. అందువల్ల మనసు ప్రశాంతంగా మారేందుకు నిత్యం సెల్ ఫన్ తో కాలక్షేపం చేయకుండా ఇలాంటి పుడ్స్ తీసుకుంటే ఆరోగ్యంతో పాటు మనసుకు ఉల్లాంగా ఉంటుంది. అంతేకాకుండా దంపతుల మధ్య ఎలాంటి మనస్పర్థలు లేకుండా హాయిగా ఉండగలుగుతారు.