Romantic Life: ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి శృంగారం అవసరం. అది లేకపోతే మనుగడ కూడా ఉండదు. అయితే సాధారణంగా అందరికి శృంగార జీవితం అనేది ముఖ్యమే. కానీ ఒక్కోరి బాడీలో ఉండే హార్మోన్ల బట్టి కొందరికి శృంగారం అంటే ఇష్టం ఉంటుంది. మరికొందరికి ఇష్టం ఉండదు. అయితే ఈ శృంగారం అనేది వయస్సు బట్టి కూడా మారిపోతుందని కొందరు అంటారు. ఉదాహరణకు పెళ్లయిన కొత్తలో ఉన్న ప్రేమ, శృంగార జీవితం తర్వాత ఉండదు. నిజం చెప్పాలంటే ఒకరు లేదా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అసలు శృంగారం మీద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఈరోజుల్లో చాలామందికి రిలేషన్‌షిప్‌లో ఉండటం ఇష్టం లేక శృంగార జీవితానికి దూరంగా ఉంటున్నారు. ఈ తరం యువత అయితే పెళ్లి వద్దు బాబు అంటూ ముప్ఫై ఏళ్లు దాటిన కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో శృంగార జీవితం తప్పనిసరిగా ఉండాలని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే శృంగార జీవితం లేకపోతే శారీరక సమస్యలతో పాటు మానసికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరి శృంగార జీవితం లేకపోతే కలిగే నష్టాలు ఏంటో ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం.
వ్యక్తిగత కారణాలు, గతంలో జరిగిన విషయాల కారణంగా కొందరు శృంగార జీవితానికి దూరంగా ఉంటారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. జీవితంలో పూర్తిగా శృంగార జీవితం లేకపోతే ఆందోళన, ఒత్తిడి పెరిగి డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శృంగారంలో పాల్గొనడం వల్ల మైండ్‌లో హ్యాపీ హార్మోన్స్ విడుదల అవుతాయి. వీటివల్ల సంతోషంగా ఉంటారు. అలాగే పార్ట్‌నర్స్ మధ్య అండర్‌స్టాడింగ్ ఉండాలంటే రొమాన్స్ చాలా ముఖ్యం. ఇద్దరి వ్యక్తులను దగ్గర చేసేది కూడా రొమాన్స్. భాగస్వాముల మధ్య గొడవలు ఉంటే రొమాన్స్ కలిపేస్తుంది. కాబట్టి ఇద్దరి మధ్య బంధం బలపడటానికి శృంగారం బాగా ఉపయోగపడుతుంది.
ఎక్కువగా శృంగారంలో పాల్గొనే వారికి కాస్త జ్ఞాపకశక్తి పెరుగుతుందట. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అదే పూర్తిగా శృంగారానికి దూరంగా ఉంటే.. మిగతా వాళ్లతో పోలిస్తే చాలా వీక్‌గా ఉంటారట. ముఖ్యంగా అమ్మాయిలు అయితే పెళ్లికి ముందు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా.. ఆ తర్వాత ఆటోమెటిక్‌గా తగ్గిపోతుంది. ఈ రోజుల్లో యువత ఎక్కువగా పెళ్లికి నిరాకరించడం వల్ల సగం మంది అనారోగ్య బారిన పడుతున్నారు. ఇంతకు ముందు రోజుల్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేవారు. కానీ రోజుల్లో ఎక్కువ రోజులు జీవించడం లేదు. వీటికి శృంగార జీవితం లేకపోవడం కూడా ఒక కారణమని చెప్పవచ్చు. అందుకే పూర్తిగా పెళ్లి చేసుకోకుండా ఉండవద్దు. దీనివల్ల ఇంకా అనారోగ్య సమస్యల బారిన పడతారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. కేవలం గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.