Romance: ప్రతి ఒక్కరి జీవితంలో శృంగారం అనేది చాలా ముఖ్యమైనది. భాగస్వాముల మధ్య ఎలాంటి గొడవలు, మనస్పర్ధలు ఉన్నా సరే.. శృంగారం ఇద్దరిని ఒకటి చేస్తుంది. భార్యాభర్తలు అన్నాక మెంటల్‌గా, ఫిజికల్‌గా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉండాలి. అప్పుడే లైఫ్ బాగుంటుంది. అయితే ఫిజికల్ లైఫ్ లేకపోతే ఇద్దరి మధ్య బంధం కూడా అంతగా బలపడదు. ఆందోళన, ఒత్తిడి, మానసిక ఆరోగ్యం బాలేకపోయిన కూడా శృంగారం అన్నింటిని బాగుచేస్తుంది. అయితే కొందరికి శృంగారం మీద తక్కువగా ఉంటే మరికొందరికి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే చాలామంది భార్యాభర్తలు శృంగారం చేసే ముందు అసలు ప్లానింగ్ లేకుండా చేస్తారు. కలయిక తర్వాత కొందరికి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. అసలు భార్యాభర్తలు కలిసిన తర్వాత కొన్ని రకాల తప్పులు చేయకూడదు. వీటివల్ల కొన్ని సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి కలయిక తర్వాత భార్యాభర్తలు చేయకూడని పనులు ఏంటో చూద్దాం.
భార్యాభర్తల మధ్య శృంగారం ఎంత ఎక్కువగా ఉంటే వారి మధ్య బంధం అంత బలంగా ఉంటుంది. అయితే కలయికలో పాల్గొన్న తర్వాత కొందరు తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే కలయిక తర్వాత జననేంద్రియాలను వెంటనే సబ్బుతో శుభ్రం చేసుకుంటారు. ఇలా చేయడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కలయికలో పాల్గొన్న అరగంట తర్వాత జననేంద్రియాలను శుభ్రం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అలాగే శృంగారం తర్వాత చాలా మంది వెంటనే మూత్ర విసర్జన చేస్తారు. ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. శృంగారం తర్వాత కనీసం 20 నిమిషాల తర్వాత మాత్రమే మూత్ర విసర్జన చేయాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారట. కలయికలో పాల్గొన్న తర్వాత చాలా మంది వెంటనే స్నానం చేస్తారు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కలయిక వెంటనే చేయకూడదు. అందులోనూ వేడి నీటితో అసలు చేయకూడదు. కలయికలో పాల్గొన్న కొంత సమయం తర్వాత చల్లని నీటితో మాత్రమే స్నానం చేయాలని నిపుణులు చెబుతున్నారు.
శృంగారం తర్వాత తప్పకుండా చేతులు శుభ్రం చేసుకోవాలి. లేకపోతే బ్యాక్టీరియా, ఫంగస్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే కలయికలో పాల్గొన్న తర్వాత తప్పకుండా నీరు తాగాలి. దీనివల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. అలాగే టైట్‌గా ఉండే దుస్తులను కూడా ధరించకూడదు. కాటన్‌లో కాస్త ఫ్రీగా ఉండే దుస్తులను కలయిక తర్వాత ధరించాలి. కలయిక తర్వాత వెంటనే నిద్రపోతే రక్తప్రసరణ సరిగ్గా జరగదు. ఒక అరగంట పాటు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత నిద్ర్రపోతే రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. తెలిసో తెలియక ఈ చిన్న తప్పులు చేయడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మిస్టేక్స్ అసలు చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.