Roasted Corn Vs Boiled Corn: వర్షాకాలంలో వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. కానీ ఈ సమయంలో ఎక్కువ పోషకాలు ఉండే పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా అవసరమైన రోగనిరోధక శక్తిని పెంచుకునే వారవుతారు. ఈ కాలంలో చీఫ్ అండ్ బెస్ట్ ఫుడ్ గా మొక్కజొన్న పొత్తులు అలరిస్తాయి.నిప్పు కణికలపై ఎప్పుడంటే అప్పుడు మొక్కజొన్నలను కాల్చినవి లభిస్తాయి. ఇందులో ఫైబర్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎలాంటి రోగాలకు గురి కాకుండా ఉంటారని చెబుతారు. అయితే ఇదే సమయంలో కొందరు ఉడకబెట్టిన కంకులను విక్రయిస్తారు. దీంతో కాల్చిన కంకులు మంచివా? లేక ఉడకబెట్టిన కంకులు ప్రయోజనమా? అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. వేటిలో ఏ పోషకాలు ఉంటాయో తెలుసుకుందాం..
కాల్చిన మొక్కజొన్న లో రోగనిరోధక శక్తి గుణాలు ఉంటాయి. ఇందులో కొవ్వు తక్కువే. దీన్ని ఆరోగ్యకరమైన స్నాక్స్ గా చెప్పుకుంటారు. ఇది తినడం వల్ల కడుపు నిండినట్లు అవుతుంది. దీంతో ఆకలి వేయకుండా ఉంటుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం వంటి పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. సీజనల్ వ్యాధుల బారిన పడేవారు మొక్కజొన్న తినడం వల్ల ఫలితం ఉండే అవకాశం ఎక్కువ. కాల్చిన మొక్కజొన్న రోడ్డు పక్కన ఎక్కడైనా లభిస్తుంది.
మొక్కజొన్నను కొందరు ఇటీవల రోడ్డుపక్కనే ఉడకబెట్టి విక్రయిస్తున్నారు. కొంచెం ఉడికిన తరువాత దానిపై ఉప్పు, కారం చల్లి నిమ్మ చెక్కను రాసి ఇస్తున్నారు. ఇలా తినడం వల్ల ఎంతో రుచిగా ఉంటుంది. అయితే ఉడకబెట్టిన మొక్కజొన్నకు ఎలాంటివి రాయకుండా తింటేనే మేలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే పచ్చి ఉప్పు పట్టించడం వల్ల హై బీపీ కి గురయ్యే ప్రమాదం ఉంది. అలాగే పచ్చి కారం తినడం కూడా అంత మంచిది కాదంటున్నారు. అయితే నిమ్మ చెక్కను దట్టించి మాత్రం తినొచ్చంటున్నారు.
ఇక ఈ రెండింటిలో ఏది బెటర్ అని చాలా మందికి సందేహం ఉంది. కాల్చిన , మొక్కజొన్న రెండింటిలోనూ పోషకాలు అధికంగానే ఉంటాయి. అయితే కాల్చిన మొక్కజొన్న పై భాగాన మాడు ఉంటుంది. అంతేకాకుండా సరిగ్గా కాలకపోయి.. పచ్చిగా ఉంటే డైజేషన్ సమస్య ఉండే అవకాశం ఉంది. పూర్తిగా కాలిన మొక్కజొన్నను తీసుకోవడం వరకు ఓకే. ఇక ఉడకబెట్టిన మొక్కజొన్న అన్ని విధాల ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. దీనిని ఉడకబెట్టడం వల్ల మొక్కజొన్నలో ఉండే చిన్నచిన్న క్రిములు బయటకు వెళ్తాయి. దీనిపై నిమ్మ చెక్క రాయవడం వల్ల ఇది తిన్నా డైజేషన్ సమస్య ఉండదు.