India vs England 3rd Odi: టీమిండియా జట్టు ఇంగ్లండ్ లోని మాంచెస్టర్ వేదికగా మూడో వన్డే ఆదివారం జరిగింది. ఇందులో ఇండియా విక్టరీ సాధించడంతో కప్ సొంతం అయింది. ఈ నేపథ్యంలో జట్లులో సంతోషం వ్యక్తమైంది. టీ20, వన్డే సిరీస్ లు రెండు దక్కించుకోవడం సంతోషకరం. దీంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్ల సంబరానికి అవధులు లేవు. హార్థిక్ పాండ్యా, రిషబ్ పంత్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దీంతో క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.

కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు మిగతా ఆటగాళ్లు షాంపేన్ తో సందడి చేశారు. ఆటగాళ్లలో సంబరం తొణికిసలాడింది. ఒకరిపై మరొకరు చల్లుకుంటూ గడిపారు. టీమిండియా సాధించిన విజయానికి అందరిలో ఆనందం వెల్లివిరిసింది. ట్రోఫీ అందుకునే క్రమంలో ఆటగాళ్లు కేరింతలు కొడుతూ హంగామా చేశారు. కప్ గెలిచిన ఆనందంలో ఉబ్బితబ్బిబ్బయైపోయారు. యువకుల కేరింతలతో క్రీడా ప్రాంగణం అంతా నవ్వుల వనంలా మారింది. దీంతో టీమిండియా విదేశీ గడ్డపై రెండు సిరీస్ లు గెలవడంతో వారి సంతోషానికి చెట్టాపట్టాల్లేవు.
Also Read: Dangerous Apps: ఈ 8 యాప్స్ ఉంటే మీ బ్యాంక్ ఖాతా డబ్బులు హుష్ కాకినే.. వెంటనే డిలీట్ చేయండి
విరాట్ కోహ్లి రవిశాస్త్రికి షాంపెన్ ఆఫర్ చేయగా రిషబ్ పంత్ తీసుకెళ్లి రవిశాస్త్రికి అందించాడు. దీంతో అందరు మురిసిపోయారు. ఇంగ్లండ్ లో తమ జట్టు విజయయాత్ర కొనసాగించడంపై ప్రసన్నం వ్యక్తం చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 259 పరుగులు చేసింది. 260 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 43.1 ఓవర్లలోనే లక్ష్యం చేరుకుంది. దీంతో ఇంగ్లండ్ ఓటమి ఖాయమైంది. కప్ ఇండియా వశమైంది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

టీమిండియా విజయాల దెబ్బకు ఇంగ్లండ్ కుదేలైంది. రెండో వన్డేలో విజయఢంకా మోగించిన ఇంగ్లండో మూడో వన్డేలో ఏం చేస్తుందోననే భయమే అందరిలో ఉంది. ఎట్టకేలకు విజయం దక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. టీ20, వన్డే సిరీస్ లు నెగ్గి ఇంగ్లండ్ కు సవాల్ విసిరింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ను అన్ని మార్గాల్లో కూడా ఆడుకుంది. ఆధిపత్యం కోసమే ఆడింది. దీంతో విదేశీ గడ్డపై కూడా మన సత్తా చాటుతామని చెప్పకనే చెప్పింది. త్వరలో జరిగే టీ20 ప్రపంచ కప్ కు సన్నద్ధమవుతున్న సందర్భంలో ఈ విజయాలు కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది.
Also Read:MLA Seethakka: రాష్ట్రపతి ఎన్నికలు : కాంగ్రెస్ కు షాకిచ్చిన సీతక్క.. ఎవరికి ఓటు వేశారో తెలుసా?