Rice: రోజుకి రెండుసార్లు కంటే ఎక్కువ అన్నం తింటే.. ఆరోగ్యానికి ప్రమాదమా?

డైలీ అన్నం తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనం లేదని, ఇంకా స్థూలకాయం వస్తుందని భావిస్తారు. దీనివల్ల కొందరు అన్నం తినడమే మానేస్తారు. అయితే రోజుకి రెండు సార్లు కంటే ఎక్కువగా అన్నం తింటే నిజంగానే స్థూలకాయం వస్తుందా? ఇందులో నిజమేంటి? ఆలస్యం చేయకుండా స్టోరీ చదివేయండి.

Written By: Kusuma Aggunna, Updated On : October 19, 2024 8:22 pm

Rice

Follow us on

Rice: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా అన్నం తింటారు. ఉత్తరాది రాష్ట్రాలు అయితే చపాతీ తినడానికి ఇష్టపడతారు. అయితే అన్నం తినడం వల్ల శరీరానికి ఎలాంటి బలం ఉండదని.. చపాతీలు తింటారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజలు ఎన్ని రకాల వంటలు తిన్న కూడా తప్పకుండా అన్నం ఉండాల్సిందే. ఒకవేళ చపాతీ తిన్న కూడా తప్పకుండా అన్నం తింటారు. లేకపోతే తిన్న ఫీలింగ్ కూడా కలగదు. అయితే డైలీ అన్నం తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనం లేదని, ఇంకా స్థూలకాయం వస్తుందని భావిస్తారు. దీనివల్ల కొందరు అన్నం తినడమే మానేస్తారు. అయితే రోజుకి రెండు సార్లు కంటే ఎక్కువగా అన్నం తింటే నిజంగానే స్థూలకాయం వస్తుందా? ఇందులో నిజమేంటి? ఆలస్యం చేయకుండా స్టోరీ చదివేయండి.

దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ శాతం మంది అన్నం తినడానికే మొగ్గు చూపుతారు. అయితే అన్నం తినడం వల్ల స్థూలకాయం వస్తుందని అనుకోవడం పొరపాటే అని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని సరైన పరిమాణంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉంటాయి. కానీ నష్టాలు ఉండవట. రోజుకి రెండు కంటే ఎక్కువ సార్లు తినడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదట. ఇలా తినడం వల్ల ఇంకా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అంటున్నారు. బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరంలో అదనపు కేలరీలను పెంచుతాయి. వీటిని రోజుకి రెండు సార్లు కంటే ఎక్కువ తినడం వల్ల శరీరానికి శక్తి పెరుగుతుంది. చపాతీ తినేవారు కూడా కొంచెం అన్నం తింటే ఇంకా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే మధుమేహం ఉన్నవారు మాత్రం రెండు పూటలు అన్నం తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఒకవేళ తినాలి అనుకుంటే వైద్యుని సూచనల మేరకు మాత్రమే తినాలి.

అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని అధికంగా తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. కాస్త లిమిట్‌లో మాత్రమే అన్నం తినాలి. వీటికి బదులుగా బ్రౌన్ రైస్ లేదా కొర్రలు వంటి వాటిని కూడా తినవచ్చు. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడతాయి. ఇందులో మెగ్నీషియం, ఐరన్, విటమిన్లు, కాల్షియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. బరువుగా ఉంటే మాత్రం అన్నం తినడం మానేయవద్దు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకుంటారు. తినే ఫుడ్‌లో కాస్త తగ్గించి వాకింగ్, జాకింగ్ వంటివి చేస్తూ బరువు తగ్గండి. అన్నం తినడం పూర్తిగా మానేస్తే బరువు తగ్గుతారని, ఎక్కువగా తింటే బరువు పెరుగుతారనేది కేవలం అపోహ మాత్రమేనని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల ఆహార పదార్థాలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.