Rice: మనం రోజూ ఎన్ని టిఫిన్లు, బయట ఫుడ్ ఎంత తిన్నా కూడా అన్నం లేకపోతే అసలు ఉండలేరు. రోజులో ఒక పూట అన్నం తినకపోతే భోజనం చేసిన ఫీలింగ్ కూడా కొందరికి ఉండదు. ప్రస్తుతం కొందరు ఉదయం పూట టిఫిన్ తింటున్నారు. మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో రైస్ తింటారు. అయితే సాధారణంగా బియ్యాన్ని కడిగి కొందరు డైరెక్ట్‌గా కకర్‌లో వండుతారు. మరికొందరు అన్నం వండటానికి ముందు బియ్యాన్ని నానబెట్టి వండుతారు. ఇలా వండటం వల్ల అన్నం పువ్వులా వస్తుందని, తినడానికి బాగా ఉంటుందని భావిస్తారు. అయితే బియ్యాన్ని ఇలా నానబెట్టి తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఎంత సమయం నానబెట్టాలి? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బియ్యం నానబెట్టి వండటం వల్ల ఆరోగ్యానికి మంచిదే. కానీ ఎక్కువ సమయం నానబెట్టడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా కొందరు బియ్యాన్ని గంటల తరబడి నానబెడుతుంటారు. 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం బియ్యాన్ని నానబెట్టి వండటం వల్ల అందులోని పోషకాలు అన్ని పోతాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 15 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయం బియ్యాన్ని నానబెట్టడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. ఇంకా మధుమేహం ఉన్నవారికి ఇలా నానబెట్టి తినడం వల్ల ప్రయోజనాకరంగా ఉంటుంది. అలాగే బియ్యాన్ని గంటల తరబడి నానబెట్టి వండటం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాగా నానితే బియ్యం సరిగ్గా ఉడకవు. దీంతో కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి బియ్యాన్ని ఎక్కువ సమయం నానబెట్టవద్దు. కేవలం 15 నిమిషాలు మాత్రమే నానబెట్టండి. ఇలా తక్కువ సమయం నానబెట్టడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పూర్తిగా తగ్గుతాయి. అలాగే రక్తపోటు అదుపులో ఉంటుంది. దీనివల్ల గుండె పోటు వచ్చే ప్రమాదాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
తక్కువ సమయం నానబెట్టి వండిన బియ్యంతో తిన్న ఆహారం ఈజీగా జీర్ణం అవుతుంది. దీంతో జీర్ణ సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. నానబెట్టిన బియ్యంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. తక్కువ సమయం బియ్యం నానబెట్టడం వల్ల రైస్ తొందరగా ఉడుకుతుంది. అలాగే మెత్తగా కాకుండా తినడానికి పువ్వులా ఉంటుంది. బియ్యంలో ఉన్న ఖనిజాలు, పోషకాలు అన్ని కూడా తొలగిపోతాయి. దీంతో మీరు అన్నం తిన్నా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. రైస్‌లోని విటమిన్లు, ఖనిజాలు అన్ని కూడా ఆ వాటర్‌లో కరిగిపోతాయి. కొందరు నానబెట్టిన బియ్యంతోనే వండేస్తారు. ఇలా చేయకుండా.. ఆ వాటర్‌ను పడేసి మళ్లీ శుభ్రం చేసిన తర్వాత మాత్రమే వండాలని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.