
Reproductive Health: ప్రస్తుత పరిస్థితుల్లో లైంగిక సమస్యలు పెరుగుతున్నాయి. జంటల్లో శారీరక శ్రమ తగ్గడం, ఆహారపు అలవాట్లు, ఒత్తిళ్లు మనుషుల్లో మార్పులు రావడానికి కారణమవుతుంది. చాలా మంది జంటలు లైంగిక సమస్యల్లో ఇరుక్కుంటున్నారు. శృంగార సమస్యలను ఎవరితోనూ చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. మన జీవన శైలిలో మార్పులు కూడా మనకు లైంగిక సమస్యలు కలిగేందుకు ఆస్కారం ఇస్తున్నాయి. ఇలాంటి సమస్యలకు త్వరగా చికిత్స తీసుకోకపోతే ఇబ్బందులు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో లైంగిక సమస్యలను నిర్లక్ష్యం చేస్తే తిప్పలు తప్పవు.
Also Read: Kidneys Health: కిడ్నీలు చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
ఒత్తిడి
ఇటీవల కాలంలో జీవితం ఉరుకుల పరుగుల యంత్రంలా మారిపోయింది. ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో మానసిక సమస్యలు వస్తున్నాయి. సంతానోత్పత్పిలో లైంగిక సామర్థ్యం బాగుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి. లేదంటే సంతాన భాగ్యం కలగదు. దేశంలో చాలా మంది జంటలు సంతాన సాఫల్యతను నోచుకోవడం లేదు. దీంతో టెస్టోస్టిరాన్ లెవల్స్ ప్రతికూలంగా మారుతోంది. దీనివల్ల ఒత్తిడిని తగ్గించుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
మానసిక సమస్యలు
మానసిక సమస్యలు అదుపులో ఉంచుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉంటే వాటిని దూరం చేసుకోవడం మంచిది. ఈ అలవాట్లు వీర్య కణాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ల్యాప్ టాప్ తొడల మీద పెట్టుకుని పనిచేయకూడదు. మానసిక స్థితిని నియంత్రణలో ఉంచుకోవాలి. వీర్య కణాల సంఖ్య పెంచుకునే ఆహారాలు తీసుకోవడమే శ్రేయస్కరం. వీలైనంత వరకు మన ఆహారాలను ఎంపిక చేసుకోవడంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదిపడితే అది తింటే నష్టాలే.
వ్యాయామం
ఆధునిక జీవన విధానంలో వ్యాయామం తప్పనిసరి. రోజు ఓ గంట వాకింగ్ చేయాలి. వీలైతే యోగా లాంటివి చేయడం సురక్షితం. దీని వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి వాటితో కూడా మనకు ప్రయోజనాలున్నాయి. జీవనశైలి మార్చుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువే. ఇవి కూడా స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు కారకాలుగా నిలుస్తాయి. వీలైనంత వరకు మనం వీటిని చేస్తూ ఉంటేనే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది.

పోషకాహారం
మనం తీసుకునే ఆహారం కూడా మనకు ముఖ్యమే. ప్రాసెస్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ హార్మోన్లను దెబ్బతీస్తాయి. వీటి వల్ల కూడా మనకు ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. అందుకే పోషకాహారం తీసుకోవడం ఉత్తమం. ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ఒమేగా ఫ్యాట్ 3 యాసిడ్లు ఉండే ఆహారాలను తీసుకుంటే ఎంతో ఫలితం ఉంటుంది. వీర్య కణాల నాణ్యత పెంచడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అందుకే వీటిని మన ఆహారంలో భాగంగా చేసుకుంటే సరి.
Also Read:Gang Leader Re Release: ‘గ్యాంగ్ లీడర్’ రీ రిలీజ్ 3 రోజుల వసూళ్లు..ఇంత తక్కువ వసూళ్లను ఊహించలేదు!