Homeలైఫ్ స్టైల్Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా రిఫ్రిజిరేటర్, వాషింగ్‌ మెషీన్ తదితర వస్తువుల అవసరం తప్పని సరి. అయితే వీటిని కొత్తగా కొనుగోలు చేయాలంటే భారీ మొత్తంలో డబ్బు ఖర్చవుతుంది. కానీీ కొంతకాలానికే ఉద్యోగం మారినా, బదిలీ అయినా వాటిని మరో నగరానికి తరలించడం కూడా అదనపు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ఇప్పుడు ఫర్నిచర్, గృహోపకరణాలను నెలవారీ అద్దెకు తీసుకునే విధానం నగరాల్లో ప్రాచుర్యం పొందుతోంది. అసలు ఎలాంటి గృహోపకరణాలు అద్దెకు ఇస్తారు? ఇవి లాభమేనా?

నగరాల్లో రెడీమేడ్ హౌస్ తో పాటు అందుబాటులో గృహోపకారణాలు అద్దెకు తీసుకోవడం ప్రస్తుతం ట్రెండి గా మారింది. ఇంటికి అవసరమయ్యే బెడ్, సోఫా వంటి ఫర్నిచర్ తోపాటు వాషింగ్‌ మెషీన్, రిఫ్రిజిరేటర్, టెలివిజన్, ఎయిర్ కండిషనర్, మైక్రోవేవ్ ఓవెన్, వాటర్ ప్యూరిఫైయర్, గీజర్ వంటి గృహోపకరణాలను కూడా అద్దెకు తీసుకునే అవకాశం ఉంది. అలాగే బెడ్, మ్యాట్రెస్, వార్డ్‌రోబ్, సోఫా, సెంటర్ టేబుల్, డైనింగ్ టేబుల్, కుర్చీలు, స్టడీ టేబుల్, ఆఫీస్ చైర్ వంటి ఫర్నిచర్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చు. కొన్ని సంస్థలు కిచెన్ అప్లయెన్సెస్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇంటీరియర్ అవసరాలను కూడా అద్దె ప్యాకేజీల్లో అందిస్తున్నాయి.

ఆయా వస్తువులను బట్టి ధరలను నిర్ణయించారు. నగరాలు, ప్రాంతాలను బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా ఉన్నాయి. ఉదాహరణకు బెడ్ లేదా మ్యాట్రెస్‌కు సుమారు రూ.300నుంచి 800, స్టడీ టేబుల్ లేదా కుర్చీకి రూ.200 నుంచి 500, సోఫాకు రూ.700 నుంచి 2,000, రిఫ్రిజిరేటర్‌కు రూ.800 నుంచి2,000, వాషింగ్ మెషీన్‌కు రూ.700 నుంచి 1,500 వరకు నెలవారీ అద్దె ఉండొచ్చు.

కొందరు గదిని అద్దెకు తీసుకొని ఇతర వస్తువులను ప్రత్యేకంగా సమకూర్చుకుంటుండగా . మరికొందరు మాత్రం గదిలో ఉండే వస్తువులతో అద్దెకు తీసుకుంటున్నారు. దీనినే స్టూడియో అపార్ట్మెంట్ ప్యాకేజీ అని అంటారు. ఈ ప్యాకేజీ లో బెడ్, మ్యాట్రెస్, వార్డ్‌రోబ్, సోఫా, టేబుల్, కుర్చీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ వంటి అవసరమైన వస్తువులను కలిపి అందించవచ్చు. ఇలాంటి ప్యాకేజీలు ఉద్యోగం కోసం కొత్త నగరానికి వెళ్లిన సింగిల్స్ లేదా దంపతులకు ఉపయోగకరంగా ఉంటాయి.

అయితే అద్దెకు తీసుకున్న వస్తువులు పాడైపోతే ఎవరి బాధ్యత ఉంటుంది? అన్న సందేహం చాలామందికి రావచ్చు. అద్దెకు తీసుకునేటప్పుడే కాంట్రాక్టర్ తో ఏర్పరచుకున్న ఒప్పందం ప్రకారం ఈ వస్తువుల బాధ్యత ఉంటుంది. సాధారణ వినియోగాలకు వస్తువులు చిన్నపాటి మరమ్మతులు ఉంటే అద్దె ఇచ్చే వారే భరిస్తారు. కానీ వినియోగదారుడి నిర్లక్ష్యం వల్ల వస్తువు దెబ్బతింటే రిపేర్ లేదా రీప్లేస్‌మెంట్ ఖర్చు చెల్లించాల్సి రావచ్చు. అందుకే ఒప్పందంలో ‘డ్యామేజ్ పాలసీ’ ఏమిటో ముందుగానే చదవాలి. వస్తువు డెలివరీ సమయంలో దాని పరిస్థితిని ఫొటోలు లేదా వీడియో తీసి ఉంచుకోవడం కూడా మంచిదే.

ప్రస్తుత కాలంలో చాలామంది నగరాలకు వలస వస్తుంటారు. ఇలాంటివారు ఉద్యోగాలు బదిలీ అయితే ఇతర ప్రాంతాలకు వెళుతుంటారు. వీరికి ఈ రెంటల్ ఎంతో ఉపయోగకరం.ఉదాహరణకు ఒక వ్యక్తి కేవలం ఒకటి లేదా రెండు సంవత్సరాలు మాత్రమే ఒక నగరంలో ఉండబోతే, లక్షల రూపాయలు పెట్టి వస్తువులు కొనుగోలు చేయడం కంటే నెలవారీ అద్దె చెల్లించడం సౌకర్యంగా ఉంటుంది. అలాగే డెలివరీ, ఇన్‌స్టాలేషన్, మెయింటెనెన్స్ వంటి సేవలు కూడా లభిస్తే అదనపు బాధ్యత తగ్గుతుంది.

అయితే ఎక్కువ కాలం ఒకే వస్తువును ఉపయోగించాల్సి ఉంటే అద్దె మొత్తం చివరికి కొనుగోలు ధరను మించిపోయే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక వస్తువును 4 నుంచి 5 సంవత్సరాలు అద్దెకు తీసుకుంటే, ఆ కాలంలో చెల్లించిన మొత్తం దాని కొత్త ధరకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండొచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version