https://oktelugu.com/

Relationship: ఈ లక్షణాలు ఉన్న స్త్రీలు ఎక్కువగా తమ భర్తలను మోసం చేస్తారట?

కొన్ని జంటల్లో భర్త మోసం చేస్తే, మరికొన్ని జంటల్లో భార్య మోసం చేస్తుంది. అయితే మోసం చేసే భార్యల్లో కొన్ని లక్షణాలు ఉంటాయట. వీటిని బట్టి ఆ స్త్రీలు భర్తను మోసం చేస్తారో? లేదో? ఈజీగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ లక్షణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 14, 2024 / 01:22 AM IST

    cheating

    Follow us on

    Relationship: భార్యాభర్తల బంధం చాలా గొప్పది. డబ్బులు వెచ్చించి మరి చాలా ఘనంగా పెళ్లిళ్లు చేసుకుంటారు. ఒక్కసారి వివాహం చేసుకుంటే ఇక జీవితాంతం ఎన్ని కష్టాలు వచ్చిన కూడా వదిలిపెట్టకూడదని ప్రమాణాలు చేసుకుంటారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది చిన్న విషయాలకు గొడవ పడి భాగస్వామిని వదులుకుంటున్నారు. సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు సహజమే. ఎంత పెద్ద గొడవ పడిన సరే.. మళ్లీ వెంటనే కలిసిపోవాలి. అంతే కానీ చిన్న వాటిని పెద్దగా చేసుకుని కొందరు విడిపోయే వరకు తీసుకెళ్తుంటారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా అయితే భాగస్వామిని మోసం చేస్తున్నారు. అబ్బాయిలు కంటే అమ్మాయిలే ఎక్కువగా భాగస్వాములను మోసం చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. భర్త భార్యను ఎంతగానో నమ్ముతాడు. కానీ కొందరు దీన్ని చులకనగా తీసుకుని భర్తలను మోసం చేస్తున్నారు. కేవలం భార్యలే మోసం చేస్తారని కాదు. ఇద్దరిలో ఎవరు మోసం చేసిన దాంపత్య బంధం దెబ్బతింటుంది. కొన్ని జంటల్లో భర్త మోసం చేస్తే, మరికొన్ని జంటల్లో భార్య మోసం చేస్తుంది. అయితే మోసం చేసే భార్యల్లో కొన్ని లక్షణాలు ఉంటాయట. వీటిని బట్టి ఆ స్త్రీలు భర్తను మోసం చేస్తారో? లేదో? ఈజీగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ లక్షణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    సోషల్ మీడియాని ఎక్కువగా వాడుతున్న మహిళ
    ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా సోషల్ మీడియాకి అలవాటు పడ్డారు. భార్యాభర్తల మధ్య సోషల్ మీడియా పెద్ద చిచ్చు పెడుతుంది. కొందరు భార్యలు భర్తను పట్టించుకోకుండా ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలోనే ఉంటారు. బయట నుంచి భర్త వచ్చిన తర్వాత కనీసం అతన్ని పట్టించుకోకుండా ఆ మొబైల్‌లోనే మునిగిపోతారు. కొందరు అయితే వారి పాస్‌వర్డ్స్, ఫొటోలు వంటివి అసలు భర్తకు తెలియనివ్వరు. ఇలాంటి భార్యలు భర్తలను మోసం చేస్తున్నారనే అనుకోవచ్చు.

    ఈ వయస్సులో ఉన్నవారు
    భార్యలు 29, 39, 49 వయస్సులో ఉన్నప్పుడు తప్పకుండా భర్తలను మోసం చేస్తారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే భర్తను మోసం చేయడానికి అసలు వయస్సుతో సంబంధం లేదని కొందరు అంటున్నారు. మోసం చేసే వాళ్లు ఎలా అయిన చేస్తారు.

    శారీరకంగా ఎక్కువగా ఎడిక్ట్ అయిన వారు
    కొంతమంది స్త్రీలు భర్తలకు శారీరకంగా ఎడిక్ట్ అవుతారు. అలాంటి వారు తమ భర్త దూరంగా ఉంటే ఇతరులకు ఎడిక్ట్ అయిపోతుంటారు. అయితే అందరూ భార్యలు కూడా ఇలా ఉండరు. కేవలం కొందరు స్త్రీలు మాత్రమే ఇలా ఉంటారు. కొందరు భర్తలు భార్యలను అసలు పట్టించుకోరు. ఇలాంటి వారి భార్యలు కూడా భర్తలను మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

    భాగస్వామితో ఇష్టం లేకుండా ఉండటం
    కొందరు స్త్రీలు ఇష్టం లేనట్లు భర్తలో ప్రవర్తిస్తారు. భర్త దగ్గరికి వస్తే ఏదో ఒకటి చెప్పి వారిని దూరం పెడుతుంటారు. భార్యాభర్తలు ఎంత దగ్గరగా ఉంటే అంతలా వారి మధ్య బంధం ఉంటుంది.

    అత్యాశ ఎక్కువగా ఉంటే స్త్రీలు
    అత్యాశతో కొందరు స్త్రీలు ఉంటారు. ఉదాహరణకు డబ్బు, ఆస్తి, అందం ఇలా దేని మీద అయిన వ్యామోహంతో ఉన్నవారు భర్తను తప్పకుండా మోసం చేస్తారు. వేరు వాటి మీద ఇష్టంతో సొంత భర్తను మోసం చేస్తుంటారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.