Relationship: పెళ్లికి ముందు కపుల్స్ థెరపీ తప్పనిసరా? దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి?

ఈ తరం జంటలకు పెళ్లికి ముందు తప్పనిసరిగా కపుల్స్ థెరపీ ఉండాలని మానసిక నిపుణులు అంటున్నారు. ఇంతకీ కపుల్స్ థెరపీ అంటే ఏమిటి? దీనివల్ల జంటలకు ఎలాంటి మేలు జరుగుతుందో చూద్దాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 28, 2024 9:09 pm

Couples Therapy

Follow us on

Relationship: ఈరోజుల్లో జంటలు ఎలా ఉన్నాయంటే పెళ్లయిన కొన్ని నెలలకే విడిపోతున్నారు. డబ్బు, అన్ని సౌకర్యాలు ఉన్న భాగస్వామిని ఎంచుకుంటున్నారు. అన్ని విధాలుగా బాగానే ఉన్నా కూడా గొడవలు పడి విడిపోతున్నారు. పూర్వం రోజుల్లో అసలు విడాకులు పదం ఎక్కువగా వినిపించేది కాదు. కానీ ప్రస్తుతం రోజుల్లో ఈ పదాన్ని ఎక్కువగా వింటున్నాం. పెళ్లి అనేది పవిత్ర బంధం. ముహూర్తాలు చూసుకుంటూ డబ్బులు ఖర్చు పెట్టి మరి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తారు. పెళ్లి అనేది ఒక బాధ్యత. కానీ ఈ రోజుల్లో కొందరు భాగస్వామిని బాధ్యతగా చూడకుండా భారంగా భావించి.. విడిపోతున్నారు. కనీసం అవగాహన లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. దీనికి తోడు పెళ్లయిన తర్వాత కుటుంబంతో కలిసి కాకుండా వేర్వేరుగా ఉంటున్నారు. దీనివల్ల బంధాలు, బంధుత్వాలు గురించి తెలియదు. భాగస్వాములు మధ్య ఏదైనా సమస్య ఉన్నా కూడా చెప్పడానికి పెద్దవాళ్లు ఉండరు. దీంతో కొందరు తెలిసో తెలియక కోపంలో నిర్ణయాలు తీసుకుంటారు. దీనివల్ల తర్వాత ఇబ్బంది పడతారు. అయితే ఈ తరం జంటలకు పెళ్లికి ముందు తప్పనిసరిగా కపుల్స్ థెరపీ ఉండాలని మానసిక నిపుణులు అంటున్నారు. ఇంతకీ కపుల్స్ థెరపీ అంటే ఏమిటి? దీనివల్ల జంటలకు ఎలాంటి మేలు జరుగుతుందో చూద్దాం.

 

కపుల్స్ థెరపీ అంటే?
పెళ్లయిన తర్వాత ఎలా ఉండాలో వివాహానికి ముందే జంటలకు ఇచ్చే కౌన్సలింగ్‌ను కపుల్స్ థెరపీ అంటారు. దీనివల్ల ఇద్దరికి పెళ్లికి మీద ఒక క్లారిటీ వస్తుంది. ఎలాంటి సమస్యలు వచ్చిన కూడా విడిపోకుండా అర్థం చేసుకుని కలిసి ఉంటారు. ప్రేమలో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. అదే ప్రేమ పెళ్లిగా మారిన తర్వాత వేరేలా ఉంటుంది. సంసార జీవితాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. భాగస్వామి అంటే ఇష్టం ఉంటే సరిపోదు.. అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలి. పెళ్లికి ముందు కపుల్స్‌కి థెరపీ ఇవ్వడం వల్ల భాగస్వామి లోపాలను సరిదిద్దుకోగలరు. పెళ్లయిన తర్వాత ఏవైనా గొడవలు వస్తే ఎలా ప్రవర్తించాలి, వాటిని పరిష్కరించడం ఎలాగో భాగస్వాములకు ఒక అవగాహన వస్తుంది.

 

కొందరు గతంలో జరిగిన విషయాలను గుర్తుపెట్టుకుని మరి గొడవలు చేస్తారు. దీనివల్ల భాగస్వాముల మధ్య దూరం పెరుగుతుంది. గొడవలు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో ఈ కపుల్ థెరపీ బాగా ఉపయోగపడుతుంది. కొన్ని జంటలు పైకి కలిసి ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తారు. కానీ ఇద్దరి మధ్య అన్యోన్యత ఉండదు. దీంతో ఎవరికి నచ్చినట్లు వారు ఉండి.. విడాకులు తీసుకుంటున్నారు. చిన్న గొడవకి పెద్దది చేసుకుంటున్నారు. ఇలా విడిపోయే పరిస్థితి రాకుండా ఉండాలంటే జంటలకు పెళ్లికి ముందు థెరపీ తప్పనిసరని రిలేషన్‌షిప్ నిపుణులు చెబుతున్నారు. ప్రతీ జంట పెద్దల నుంచి ఈ థెరపీ తీసుకోవడం ఆ బంధం జీవితాంతం సంతోషంగా ఉంటుంది.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు రిలేషన్‌షిప్ నిపుణుల సలహాలు తీసుకోగలరు.