https://oktelugu.com/

Relationship : పిల్లల ముందు భార్యాభర్తలు అస్సలు ఈ పనులు చేయవద్దు?

పడక విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి.లేకుంటే ఈ ప్రభావం వారిపై పడి భవిష్యత్ లో వారి జీవితంపై ఈ ప్రభావం ఉంటుందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2023 / 11:54 AM IST
    Follow us on

    Relationship : దాంపత్య జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో అంతే కష్టమనిపిస్తుంది. కుటుంబంలో వచ్చిన సమస్యలు, సంతోషాలు ఎక్కడా కనిపించవు. ముఖ్యంగా వివాహం కాగానే భార్యభర్తల జీవితం కంటే పిల్లలు వచ్చాక వారీ జీవితంలో ఊహించిన సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. పిల్లలు జన్మించాక వారిని పెంపకంపై దృష్టి సారించి వారి ఎదుగుదల గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో దంపతులిద్దతూ తమ సొంత ప్రయోజనాలు త్యాగం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పిల్లల ముందు భార్యభర్తలు కొన్ని పనులు చేయకూడదని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. అవేంటో తెలుసుకుందాం..

    కొందరు పిల్లలు పెరుగుతున్న క్రమంలో లేదా పెరిగి యవ్వం వయసు వచ్చాక వారు తల్లిదండ్రుల మాట వినరు. వారు చెప్పిన పని చేయరు. అయితే తల్లిదండ్రులు తాము ఎంతో అన్యోన్యంగా పెంచినా ఇలా తయారయ్యాడేంటి? అని చింతిస్తూ ఉంటారు. కానీ వారు ఇలా మారడానికి తల్లిదండ్రులే కారణమని అంటున్నారు. ఇలాంటి వారు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వారి ముందు తల్లిదండ్రులు కొన్ని చేయకూడని పనులు చేస్తుంటారు. ప్రధానంగా పిల్లల ముందు భార్యభర్తలు ఒకరి మాట మరొకరు వినరు. వీరిద్దరి మధ్య ఇగో ప్రాబ్లం వల్ల ఎవరికి వారే అన్నట్లు ప్రవర్తిస్తారు. ఈ ప్రభావం పిల్లపై కూడా పడుతుందని చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు.

    కొంత మంది దంపతులు అన్యోన్యంగా జీవిస్తారు. భార్యభర్తలు ఎంతో ఇష్టంగా జీవిస్తారు. ఈ క్రమంలో వారు సందర్భాన్ని భట్టి రొమాన్స్ మూడ్ లోకి వెళ్తారు. అయితే తండ్రులు పిల్లల ముందే భార్య కౌగిలించుకోవడం, ఇతర పనులు చేయడం వంటివి చేస్తారు. వారు చిన్న పిల్లలు కదా.. పట్టించుకోరు.. అని భావిస్తారు. కానీ ఈ ప్రభావం వారిపై కచ్చితంగా పడుతుందని అని అంటున్నారు. ఇక రాత్రి నిద్రించాక పిల్లలు పక్కనే ఉండగా కొందరు శారీరకంగా కలుస్తారు. అయితే వారు పడుకున్నారు కదా.. అని అనుకుంటారు. కొందరు పిల్లలకు మెళకువ వచ్చి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో చూస్తారు. వారికి ఆ సమయంలో అర్థం కాకపోయినా భవిష్యత్ లో వారికి ఈ ఆలోచనలు వెంటాడుతూ ఉంటాయి.

    ఇటీవల ఒక అమ్మాయి కళాశాల వెళ్తున్న క్రమంలో పక్కదారి పట్టింది. చెడు స్నేహాలు ఎక్కువగా చేసింది. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినలేదు. దీంతో వారు ఆ అమ్మాయిని కౌన్సెలింగ్ సెంటర్ కు తీసుకెళ్లారు. కౌన్సెలింగ్ లో ఆ అమ్మాయి షాకింగ్ విషయాలను బయటపెట్టింది. తాను చిన్నప్పుడు తన తల్లి చేసే పని అస్సలు నచ్చలేదని, ఆ కోపంతోనే తాను ఇలా ప్రవర్తిస్తున్నానని చెప్పడం ఆశ్చర్యం వేసింది. దీంతో అప్పటికీ గానీ ఆ తల్లి తేరుకోలేదు.

    ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే కొందరు తల్లిదండ్రు ఎలాంటి తప్పుడు పనులు చేయకపోయినా… పిల్లలతో మంచిగా ఉన్నా చెడిపోతూ ఉంటారు. ఇలాంటి వారి సంఖ్య తక్కువే ఉండొచ్చు. కానీ సాధ్యమైనంత వరకు పిల్లలపై తల్లిదండ్రులు ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దు. ప్రధానంగా ఒకరిని మరొకరు గౌరవించుకోవాలి. పడక విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి.లేకుంటే ఈ ప్రభావం వారిపై పడి భవిష్యత్ లో వారి జీవితంపై ఈ ప్రభావం ఉంటుందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.