https://oktelugu.com/

Relation: మూప్ఫై ఏళ్ల వయస్సులో భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉంటుందంటే?

ముప్ఫై ఏళ్ల వయస్సులో ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరుగుతుంది. కానీ తగ్గదట. మూప్ఫై ఏళ్ల వయస్సులో భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉంటుందో మరి చూద్దాం..

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 14, 2024 / 06:08 PM IST
    Follow us on

    Relation: దాంపత్య జీవితంలో ఏ విషయాన్ని అయిన అర్థం చేసుకోవడానికి వయస్సు ఉండాల్సిందే. ఎందుకంటే చిన్న వయస్సులో పెళ్లి చేసుకుంటే భాగస్వామి అవుతారు. కానీ అన్నింటిని అర్థం చేసుకునే భాగస్వామి అవుతారని అసలు చెప్పలేం. దాంపత్య జీవితంలో ఎవరికైనా అర్థం చేసుకునే గుణం తప్పనిసరిగా ఉండాలి. అయితే ఈ రోజుల్లో చాలా మంది చిన్న వయస్సులోనేపెళ్లి చేసుకోవడం, మళ్లీ విడిపోవడం వంటివి చూస్తూనే ఉన్నాం. భార్యాభర్తల మధ్య పెళ్లయిన కొత్తలో బంధం సంతోషంగా ఉంటుందని పిల్లలు పుట్టిన తర్వాత అలా ఉండదని అనుకుంటారు. కాలం గడిచే కొద్దీ భాగస్వామి మీద ప్రేమ తగ్గుతందని అనుకుంటారు. కానీ పెళ్లయిన రోజుల గడిచే కొలది పెరుగుతుందట. అయితే ఎక్కువ శాతం మంది ప్రేమ తగ్గిపోతుందని, ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ ఉండదని భావిస్తారు. ముఖ్యంగా ముప్ఫై ఏళ్ల వయస్సులో ఒకరి మీద ఒకరికి ప్రేమ పెరుగుతుంది. కానీ తగ్గదట. మూప్ఫై ఏళ్ల వయస్సులో భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉంటుందో మరి చూద్దాం..

    ఎమోషనల్ మెచ్యూరిటీ ఉంటుంది
    ముప్ఫై కంటే తక్కువ వయస్సులో ఉన్నప్పుడు భాగస్వాములు దూరంగా అసలు ఉండలేరు. మిస్ అవుతున్న, చూడకుండా ఉండలేనని ఫీల్ అవుతారు. కానీ ముప్ఫై ఏళ్లు వచ్చేసరికి ఇలా ఉండరు. అలా అని భాగస్వామి మీద ప్రేమ తగ్గుతుందని అని కాదు. ఎమోషనల్‌గా అర్థం చేసుకునే మెచ్యూరిటీ వస్తుంది. భాగస్వామిని ఏ విషయంలో అయిన అర్థం చేసుకుంటారు. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కూడా మెరుగుపడుతుంది.

    బాధ్యతలు తెలుస్తాయి..
    చిన్న వయస్సులో ఉన్నప్పుడు అసలు బాధ్యతలు తెలియవు. ఎంత సంపాదిస్తున్నారు, ఖర్చులు, ఇంటి విషయాలు అన్ని అసలు పట్టించుకోరు. కానీ 30 ఏళ్లు వచ్చేసరికి బాధ్యత, బంధాల విలువలు తెలుస్తాయి. అప్పటి వరకు భాగస్వామికి గౌరవం, ప్రాధాన్యత ఇవ్వకపోవడం, పట్టించుకోకపోవడం వంటివి చేస్తారు. కానీ ఈ వయస్సులోకి వచ్చిన తర్వాత పిల్లలు, తల్లిదండ్రుల బాధ్యత, ఇతరులను గౌరవించడం, భాగస్వామిని అర్థం చేసుకోవడం వంటివి నేర్చుకుంటారు.

    పరస్పర గౌరవం
    దాంపత్య బంధంలో పరస్పర గౌరవం తప్పకుండా ఉండాలి. అయితే చిన్న వయస్సులో ఇద్దరిని ఒకరికి ఒకరు గౌరవించుకోరు. కానీ రోజులు ముందుకు వెళ్లే కొలది.. ఇంటి బాధ్యతలు, పిల్లలు అన్నింటి వల్ల భాగస్వామిని గౌరవించడం మొదలు పెడతారు. ప్రతి విషయంలోనూ ఇద్దరూ గౌరవించుకోవడం మొదలు పెడతారు. దీనివల్ల గొడవలు లేకుండా సంతోషంగా ఉంటారు.

    దగ్గర అవుతారు
    ఈ వయస్సులో తెలియకుండా ఒక బాధ్యత వస్తుంది. దీంతో అన్ని విషయాలను భాగస్వామితో చర్చించుకుంటారు. ప్రతీ విషయాన్ని ఇలా చర్చించుకోవడం వల్ల ఇద్దరి బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. దీనివల్ల గొడవలు రాకుండా జీవితాంతం సంతోషంగా ఉంటారు.

    జీవితంలో అభివృద్ధి ఉండాలని..
    అందరిలో కుటుంబం గౌరవంగా బతకాలని భావించి జీవితంలో అభివృద్ధి చెందాలని అనుకుంటారు. తనతో పాటు కుటుంబం, పిల్లలు అందరూ గౌరవంగా బతకాలంటే.. ఆర్థికంగా కూడా కాస్త నిలకడగా ఉండాలని భావించి, చిల్లర ఖర్చులు చేయకుండా ఉంటారు. ముఖ్యంగా ఈ వయస్సులో బాధ్యతలు తెలుసుకోవడంతో పాటు డబ్బుల విలువ తెలుసుకుని జాగ్రత్తగా ఉంటారట.