Reasons Behind Affairs: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఏ టీవీ, పేపర్ చూసినా వీటికి సంబంధించిన వార్తలే ఉంటున్నాయి. దీంతో వీటిపై చర్చ జరుగుతోంది. ఎందుకు వివాహేతర సంబంధాల వైపు చూస్తున్నారు? భార్య లేదా భర్త జీవిత భాగస్వామిని ఎందుకు దూరం చేసుకుంటున్నారు? పరాయి వారి మోజులో ఎందుకు పడిపోతున్నారు? అనే విషయాలపై పరిశోధనలు కూడా చేస్తున్నారు. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. పూర్వం నుంచి మన వివాహ వ్యవస్థలో ఉండే నమ్మకాలు వమ్ము అవుతున్నాయి. నాతి చరామి అని ప్రమాణం చేసిన వారే పరాయి వారికి ఆకర్షితులు కావడం గమనార్హం.

పరిశోధనల్లో తేలిన అంశం ఏంటంటే ఎక్కువ మంది తమ జీవిత భాగస్వామి వద్ద తమకు సుఖం లేక ఇతరుల వ్యామోహంలో పడుతున్నట్లు వెల్లడైంది. జీవిత భాగస్వామి అనుకూలంగా లేకపోతే ఆ దిశగా వారిని మార్చుకోవాలి. కానీ ఇతరులతో లైంగిక సంబంధం పెట్టుకోవడంతో సంసారం కకావికలం అవుతుంది. జీవిత భాగస్వామి, పిల్లలు బాధలు అనుభవించాల్సి వస్తుంది. తన సుఖం కోసం తాను చూసుకునే వారు ఇక సంసారాన్ని గురించి ఏం పట్టించుకుంటారు. ఫలితంగా వారి కాపురం ముక్కలై పోతోంది.

ఇంకా ఎక్కువ మంది తమకు పెళ్లి కాకముందు ఉన్న సంబంధాలే కొనసాగిస్తుట్లు చెబుతున్నారు. వివాహం కాక ముందే పెట్టుకున్న సంబంధం కావడంతో పాత పరిచయంతో ఆమె, అతడు వారితోనే కాలం గడిపేందుకు నిర్ణయించుకుంటున్నారు. ఫలితంగా కట్టుకున్న భార్య, భర్తకు చిక్కులు ఎదురవుతున్నాయి. సంసారంలో వివాహేతర సంబంధమనే కలుపు మొక్క చేరడంతో ఇక ఏం చేయాలని రోదిస్తున్నారు. ఇలా సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇది సరైంది కాదని తెలిసినా అటు వైపే మొగ్గు చూపుతున్నారు. కట్టుకున్న వారికి బాధలే మిగుల్చుతున్నారు.
Also Read: Relationship Tips: మహిళలను ఆ మూడ్ లోకి తీసుకురావడమెలాగో తెలుసా?
వైవాహిక అనుబంధం పై అసంతృప్తితో ఉన్న వారే ఇతరులతో సుఖాలు పంచుకుంటున్నట్లు తేలింది. చిన్నతనంలో ఎదురైన చేదు అనుభవాలు కూడా వివాహేతర సంబంధాలకు దారి తీస్తున్నట్లు చెబుతున్నారు. జీవితభాగస్వామి అందంగా లేకపోవడం వల్ల కూడా వివాహేతర సంబంధాల వైపు మొగ్గు చూపుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. తక్కువ ఆకర్షణీయంగా ఉండే మహిళలే ఎక్కువగా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారట. ఇలా వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. హాయిగా సాగుతున్న సంసారంలో అక్రమ సంబంధాలు చిచ్చులు పెడుతున్నాయి. చివరకు హత్యలకు దారితీయడం గమనార్హం.