https://oktelugu.com/

Ram prasad : వెయిట్‌ లాస్‌ సీక్రెట్‌ చెప్పిన భారత సంతతి సీఈవో.. అతను ఎంత తగ్గాడో తెలుసా?

భారత సంతతికి చెందిన బిహేవియరల్‌ సైన్స్‌ సొల్యూషన్స్‌ కంపెనీ ఫైనల్‌ మైల్‌ కన్సల్టింగ్‌ వ్యవస్థాపకుడు, సీఈవో రామ్‌ ప్రసాద్‌ ఏకంగా 45 కిలోల బరువు తగ్గారు. ఆయన తన వెయిట్‌ లాస్‌ జర్నీ గురించి సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లతో షేర్‌ చేసుకున్నారు. తాను స్థిరమైన అలవాట్లతో బరువు తగ్గగలిగానని తెలిపారు. ముందుగా వెయిట్‌ లాస్‌ జర్నీలో తలెత్తే సందేహాలను, అనుమానాలను పక్కకు పెట్టేయాలని సూచించారు

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 12, 2024 / 10:01 PM IST
    Follow us on

     

    Ram prasad : ఉరుకుల పరుగుల జీవితం… మారిన ఆహార నియమాలు, జంక్‌ ఫుడ్, భోజనంపై నియంత్రణ లేకపోవడం, శారీరక వ్యాయామం తగ్గడం, పని ప్రదేశాల్లోనూ శారీరక శ్రమ లేకపోవడం, యాంత్రిక జీవనం కారణంగా స్థూలకాయం పెరుగుతోంది. అనూహ్యంగా శరీర భరువు పెరడంతో ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. ఇక వెయిల్‌ టాస్‌ కోసం ఉదయం మైదానాలు, సాయంత్రం జిమ్‌లలో కసరత్తు చేస్తున్నారు. వెయిట్‌ లాస్‌ చేస్తామంటూ పుట్టగొడుగుల్లా వెలుస్తున్న క్లినిక్‌లకు పరుగులు పెడుతున్నారు. బరువు పెరగడం శారీరక శ్రమకు మించిన కష్టమైన ప్రక్రియ. డైట్‌ను, జీవన శైలిని మార్చకపోవడమే బరువు పెరగడానికి కారణం. ఇక బరువు తగ్గాలనే సంకల్పం ఉంటే తగ్గగలమని నిరూపించాడు భారత సంతతి సీఈవో. అతను ఏకంగా 45 కిలోల బరువు తగ్గి చూపించాడు. అందుకోసం ఆయన కొన్ని ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లను అనుసరించాడు. ఇంతకీ అతనెవరు.. ఎలా ఇన్ని కిలోలు తగ్గారు అనేది తెలుసుకుందాం.

    ఎలా తగ్గాడంటే…
    భారత సంతతికి చెందిన బిహేవియరల్‌ సైన్స్‌ సొల్యూషన్స్‌ కంపెనీ ఫైనల్‌ మైల్‌ కన్సల్టింగ్‌ వ్యవస్థాపకుడు, సీఈవో రామ్‌ ప్రసాద్‌ ఏకంగా 45 కిలోల బరువు తగ్గారు. ఆయన తన వెయిట్‌ లాస్‌ జర్నీ గురించి సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లతో షేర్‌ చేసుకున్నారు. తాను స్థిరమైన అలవాట్లతో బరువు తగ్గగలిగానని తెలిపారు. ముందుగా వెయిట్‌ లాస్‌ జర్నీలో తలెత్తే సందేహాలను, అనుమానాలను పక్కకు పెట్టేయాలని సూచించారు. ఎక్స్‌ఫ్లోర్‌ వర్సెస్‌ ఎక్స్‌ఫ్లోయిట్‌ ట్రెయిట్స్‌ వర్సెస్ట్‌ స్టేట్‌ హాబిట్‌ లాండరింగ్‌ వర్సెస్‌ మోటివేషన్, డిఫెరింగ్‌ రివార్డస వర్సెస్‌ విల్‌ పవర్‌ వంటి పాయింట్లపై దృష్టిపెట్టాని సూచించారు.

    ఎలాంటి జీవన శైలి కావాలో..
    రామ్‌ ప్రసాద్‌ సూచనల ప్రకారం.. వెయిట్‌ లాస్‌ కావాలనుకునేవారు ముందుగా ఎలాంటి జీవనశైలి కావాలో ఎంచుకోవాలి. అందుకోసం శోధించాలి. ఒక్కోసారి ఆ డైట్‌ని స్కిప్‌ చేయాలనిపించినప్పుడూ ఎలా ఆ ఫీలింగ్‌ని వాయిదా వేయాలి. అలాగే ప్రస్తుత పరిసిథతి, మీ శరీర తత్వానికి అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దీంతోపాటు అలవాట్లను స్కిప్‌ చేయకుండా ఉండేలా ప్రేరణనిచ్చే వాటిని ఎంచుకోవడం ముఖ్యం. వాయిదా పద్ధతికి స్వస్తి పలికి విల్‌పవర్‌ చేయడం వంటివి అనుసరించాలని సూచించారు.

    బరువు తగ్గడంలో సహకారం..
    బరువు తగ్గడంలో తనకు సహకరించిన వాటి గురించి కూడా రామ్‌ప్రసాద్‌ వెల్లడించారు. డైట్‌లో రెండు నెలలపాటు షుగర్‌ తీసుకోకుండా ఉండడం, ఏడాదిపాటు వాకింగ్‌ చేయడం, నాలుగైదు నెలలపాటు శుభ్రంగా తినడం వంటివి చేసినట్లు వివరించారు. అలాగే మూడేళ్లు ఒకేపూట భోజనం, వర్కౌట్లపై దృష్టిసారించడం వంటివి చేసినట్లు వెల్లడించారు

    బరువు తగ్గాలంటే..
    ఇక చివరగా బరువు తగ్గాలనుకున్నప్పుడు అందుకు సంబంధించి ఏర్పర్చుకున్న మన లక్ష్యాలపై ఫోక్‌స్‌ పెట్టాలని రామ్‌ప్రసాద్‌ సూచించారు. అప్పుడే సులభంగా వెయిట్‌ లాస్‌ కాగలుగుతామని చెప్పారు. మనం ఏది అనుకుంటున్నామో అది పక్కాగా చేస్తే లక్ష్యం రీచ్‌ అవుతామని తెలిపారు. ఇలా తాను 45 కిలోల బరువు తగ్గానని పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో వెయిట్‌ లాస్‌ జర్నీపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ జర్నీ ఎంతో స్ఫూర్తిని కలిగించిందంటూ నెటిజన్లు ప్రశంసించారు. వందలాది కామెంట్లు పెట్టారు.