Jobs: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెటలర్జీ, మెటీరియల్స్ ఇంజనీరింగ్ విభాగాలతో పాటు సివిల్ ఇంజనీరింగ్ లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.
బీఈ/బీటెక్, ఎం.ఈ, ఎంటెక్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళిలకు అర్హులు కాగా పీహెచ్‌డీ అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ అండ్ మేనేజ్‌మెంట్ పోస్టులతో పాటు ఇతర ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. నెట్/ స్లెట్/ సెట్ అర్హతతో పాటు అనుభవం అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు.
కనీసం 55 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఆన్‌లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2022 సంవత్సరం మార్చి 21వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీస్థాయిలో మేలు జరుగుతుందని చెప్పవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలి. https://www.rgukt.ac.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.