Radish leaves:ఆకుకూరలు, దుంపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని డైలీ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మార్కెట్లో ఎన్నో రకాల ఆకుపచ్చ కూరగాయలు కనిపిస్తాయి. చాలా మంది ఎక్కువగా ముల్లంగిని కొంటుంటారు. ఈ దుంపలను తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూరుతాయని భావిస్తారు. అయితే కొందరు ఈ దుంపలకు ఆకులు కూడా ఉంటాయి. వీటిని కొందరు పడేసి, కేవలం ముల్లంగిని మాత్రమే తింటారు. ఇందులోని ఉండే పోషకాల గురించి తెలియక చాలా మంది చెత్తలో పడేస్తారు. కానీ ఈ ఆకుల వల్ల కొన్ని అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మిగతా ఆకుకూరలు ఎలా ఆరోగ్యానికి మేలు చేస్తాయో.. ఇవి కూడా అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేస్తుంది. ఈ ముల్లంగిలోనే కాకుండా ఆకుల్లో కూడా ఎన్నో ప్రొటీన్లు ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడతాయి. మరి ఈ ముల్లంగి ఆకులను ఎలా వండుకుని తింటే ఆరోగ్యానికి మంచిది? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ముల్లంగిలోనే కాకుండా వాటి ఆకుల్లో కూడా పీచు, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సి, బి9, సోడియం, మెగ్నీషియం, క్లోరిన్, కార్బోహైడ్రేట్లు వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకులను పడేయకుండా వాడటం వల్ల పైల్స్, హై బ్లడ్ షుగర్, గుండె జబ్బులు, మధుమేహంతో పాటు అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా విముక్తి పొందవచ్చు. ముల్లంగి కంటే వాటి ఆకుల్లోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా కాపాడుతుంది. పైల్స్ సమస్య ఉన్నవారు ఆ ఆకులను తినడం వల్ల సమస్య క్లియర్ అవుతుంది. అలాగే కడుపు ఉబ్బరం, మంట, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ముల్లంగి ఆకుల్లో కేలరీలు తక్కువగా పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇందులో విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటివి కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది.
ముల్లంగి ఆకుల్లో తక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. దీన్ని ఏదో విధంగా వంట చేసుకుని తినడం వల్ల శరీరంలో ఉండే రక్తం శుద్ధి అవుతుంది. దీనివల్ల చర్మంపై ఎలాంటి మొటిమలు, మచ్చలు, దురదలు, దద్దర్లు ఉన్నా కూడా తగ్గుతాయి. ఈ ముల్లంగి ఆకుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. కొందరు ఎక్కువగా రక్తపోటు సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు ఈ ముల్లంగి ఆకులను వండుకుని తింటే సమస్య తొందరగా తగ్గిపోతుంది. ఈ ఆకుల్లో విటమిన్ సి, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.