Chanakyaniti: బుద్ధిమంతులు ఈ కాలంలో ఉండటం చాలా తక్కువ. కానీ కొందరు మంచితనం, స్నేహభావం, మంచి లక్షణాలు కలిగి ఉంటారు. అయితే ఆచార్య చాణక్యుడు తన శిష్యులకు ఎన్నో బోధనలు చేశారు. ఇందులో భాగంగా కొన్ని రహస్యాలను బయటపెట్టకుండా ఉండటమే బుద్దిమంతులు బయటపెట్టరు అని తెలిపారు. అయితే వాస్తవానికి బుద్దిమంతులు కొన్ని రహస్యాలను బయటపెట్టరట. ఇంతకీ ఆ రహస్యంగా ఉంచాల్సిన విషయాలు ఏంటి? ఆచార్య చాణక్యుడు ఏం చెప్పారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సుసిద్ధౌషధం ధర గృహచ్ఛిద్రం వ మైధునమాకుభుక్తం
కుశృతం చైవ మతిమాత్ర ప్రకాశయేత్
ఈ పద్యం ద్వారా ఎలాంటి విషయాలను గోప్యంగా ఉంచాలో తెలిపారు చాణక్యుడు. సిద్ధ ఔషధాలు, చేసిన సాయం, ఇంట్లో లోటుపాట్లు, సంభోగం, చెడు భోజనం, తను విన్న చెడు మాటల గురించి బుద్దిమంతులు ఎప్పుడు ఎవ్వరితోనూ ప్రస్తావించరని ఈ శ్లోకం అర్థం. కొన్ని మందులు కొందరికి సిద్దిస్తాయి, కొందరికి మేలు చేస్తాయి. అయితే ఈ విషయాలను మాత్రం ఎవరికి చెప్పకూడదట. చెబితే మందు ప్రభావం తగ్గుతుందని అంటారు చాణక్యుడు. 2..తను చేసిన ధర్మ గురించి కూడా ఎవ్వరికీ చెప్పకూడదు. ఆ ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి కానీ చెప్పకూడదు.
ప్రతి కుటుంబంలో లోటుపాట్లు కామన్. వాటిని పరిష్కరించుకోవాలి కానీ ఇతరులకు చెప్పకూడదు. అలా చెప్పడం వల్ల చులకనయ్యేది, మోసపోయేది మీరు అని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఇంట్లో ఉండే ఈ కష్టనష్టాలను, లోటుపాట్లను ఇతరులకు చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ చులకన మాత్రం అవుతారు. జీవిత భాగస్వామితో ఏకాంతంగా గడిపిన సమయం, ఆ సమయంలో మాట్లాడుకున్న విషయాల గురించి కూడా ఎవ్వరితో చర్చించకూడదు. అలా చర్చిస్తే అది కచ్చితంగా మూర్ఖత్వమే అవుతుంది. వీటిని వేరేవారితో చర్చించడం సరికాదని గుర్తు పెట్టుకోండి.
తినకూడదు అని చెప్పిన వాటిని ఏమైనా తింటే వాటిని గుర్తు పెట్టుకొని మరోసారి అలాంటి పొరపాటు చేయకుండా ఉండాలి కానీ ఆ విషయాన్ని బయట చెప్పాల్సిన అవసరం లేదు. దీని వల్ల అల్లరి పాలవుతారు తప్ప మంచి జరగదు అన్నారు చాణక్యుడు. ఎవరైనా తప్పుడు మాటలు చెప్పినా ఇతరుల గురించి చెప్పినా కూడా వాటిని వింటే ఇతరులతో షేర్ చేయవద్దు. అలా చేయడం వల్ల మీరు మంచితనాన్ని కోల్పోతారు. కాబట్టి మీ పెదవి దాటనివ్వకండి అని చెప్పారు చాణక్యుడు.