https://oktelugu.com/

Purple Cabbage: ఈ కలర్ క్యాబేజీ ఎప్పుడైనా తిన్నారా.. ఒక్కసారి తింటే జీవితంలో వదలరు

అరుదుగా దొరికే పర్పుల్ కలర్ క్యాబేజీ తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని డైలీ తింటే ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. మరి ఈ పర్పుల్ కలర్ క్యాబేజీ తినడం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 19, 2024 / 02:25 AM IST

    Purple cabbage

    Follow us on

    Purple Cabbage: ఆకుపచ్చ రంగులో ఉండే క్యాబేజీ గురించి అందరికీ తెలిసిందే. దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తినడం ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. క్యాబేజీలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, పొటాషియం, ఫోలేట్, విటమిన్ ఈ, విటమిన్ కె, అమైనో ఆమ్లాలు, పాలీఫెనాల్స్, ఫైటోస్టెరాల్స్, గ్లూకోసినోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా సహాయపడతాయి. అయితే థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు వీటికి కాస్త దూరంగా ఉంటారు. ఈ క్యాబేజీని కూరలు లేదా పకోడి చేసుకుని తింటారు. తినడానికి టేస్టీగా ఉండటంతో పాటు జీర్ణ సమస్యలు, కడుపులో మంటను కూడా తగ్గిస్తుంది. అయితే మనకి మార్కెట్లో ఎక్కువగా ఆకుపచ్చ రంగులో ఉండే క్యాబేజీ కనిపిస్తుంది. కానీ పర్పుల్ రంగులో ఉండే క్యాబేజీ పెద్దగా కనిపించదు. అరుదుగా దొరికే ఈ పర్పుల్ కలర్ క్యాబేజీ తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని డైలీ తింటే ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. మరి ఈ పర్పుల్ కలర్ క్యాబేజీ తినడం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకుందాం.

     

    సాధారణ క్యాబేజీతో పోలిస్తే పర్పుల్ కలర్ క్యాబేజీలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులోని ఫైబర్, ప్రొటీన్, విటమిన్లు, కాల్షియం, కార్బోహైడ్రేట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో తక్కువగా కేలరీలు ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి ఈజీగా ఉపయోగపడుతుంది. వారానికి ఒకటి నుంచి రెండు సార్లు వీటిని తినడం వల్ల బరువు తగ్గుతారు. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు వల్ల బీపీ కూడా అదుపులో ఉంటుంది. ఇందులోని పోషకాల వల్ల చర్మం కూడా నిగారింపుగా ఉంటుంది. చర్మంపై ఎలాంటి ముడతలు, మచ్చలు లేకుండా ఉంటుంది. తొందరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. ఈ పర్పుల్ కలర్ క్యాబేజీలో ఎక్కువగా విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో బాగా సహాయపడుతుంది. వీటితో పాటు బోలు ఎముకల వ్యాధి, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల బారిన పడకుండా కూడా పర్పుల్ క్యాబేజీ బాగా సహాయపడుతుంది. పర్పుల్ కలర్‌ క్యాబేజీలో ఆంథోసైనిన్ అనే వర్ణ ద్రవ్యం ఉంటుంది. దీనివల్ల ఈ క్యాబేజీకి ఊదా రంగు వస్తుంది. ఈ క్యాబేజీని తినడం వల్ల కడుపులో మంట, ఉబ్బరం, గ్యాస్ట్రిక్, జీర్ణ సమస్యలు అన్ని కూడా తగ్గుతాయి. అలాగే గుండె కూడా ఆరోగ్యంగా ఉండటంతో ప్రేగు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఈ పర్పుల్ క్యాబేజీని డైట్‌లో యాడ్ చేసుకోవడం వల్ల ప్రమాదకరమైన వ్యాధుల బారిన నుంచి విముక్తి పొందవచ్చు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎలాంటి వ్యాధులు దరి చేరకుండా కాపాడుతుంది.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.