Proteins: కండరాలు బలంగా ఉండి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి ప్రొటీన్లు తప్పకుండా అవసరం. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా యాక్టివ్‌గా ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది రోజూ ప్రొటీన్లు తీసుకుంటారు. ముఖ్యంగా వ్యాయామం, జిమ్ చేసే వాళ్లు అయితే తప్పకుండా ప్రొటీన్ ఫుడ్‌ను ఫాలో అవుతుంటారు. శరీర ఆరోగ్యానికి ప్రొటీన్ ఫుడ్ చాలా ముఖ్యమైనది. ప్రతీ ఒక్కరూ కూడా తప్పకుండా ఈ ఫుడ్‌ను తీసుకోవాలి. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గుడ్లు, మాంసం, పాలు, సోయాబీన్స్ ఇలా ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తింటారు. వీటిని తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరనివ్వకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే శరీర ఆరోగ్యానికి ఎంత మంచివి అయిన కూడా ఏవైనా లిమిట్‌లో తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. అంతకంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి నష్టాలు తప్ప ప్రయోజనాలు ఉండవు. అయితే ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొటీన్ అవసరమే. కానీ రోజుకి మితంగానే తీసుకోవాలి. ప్రొటీన్లు శరీరానికి అందడం వల్ల ఎముకలు, కండరాలు బలంగా ఉంటాయి. కానీ అధికంగా తీసుకుంటే శరీరం కొన్ని అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అవేంటో మరి తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం ఆర్టికల్‌లో చదివేయండి.
దాహం ఎక్కువగా వేయడం
దాహం వేయడం మంచిదే. ఎందుకంటే దాహం వేయడం వల్ల ఎక్కువగా వాటర్ తాగుతారు. కానీ శరీరానికి ప్రొటీన్ ఎక్కువ అయితే నీరసం వల్ల దాహం వేస్తుంది. దీనివల్ల నీరు అధికంగా తాగుతారు. నీరు ఆరోగ్యానికి మంచివి అయినప్పటికీ అధికంగా తాగడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రొటీన్లు ఎక్కువై దాహం వేయడం వల్ల బలహీనంగా మారిపోవడంతో తలనొప్పి, బరువు తగ్గిపోవడం వంటి సమస్యలు అన్ని కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నోటి దుర్వాసన
సాధారణంగా బ్రష్ సరిగ్గా చేయకపోతే నోటి దుర్వాసన వస్తుంది. కానీ శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు కంటే అధికం అయినప్పుడు నోటి దుర్వాసన పెరిగిపోతుంది. ప్రొటీన్లలో ఉండే ఆమ్లాలు నోటి నుంచి దుర్వాసన రావడానికి కారణమవుతాయి. కాబట్టి రోజుకి మితంగానే ప్రొటీన్లు తీసుకోవడం అలవాటు చేసుకోండి.
మలబద్ధకం
ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య పెరుగుతుంది. ప్రొటీన్ల వల్ల కార్బోహైడ్రేట్లు తగ్గిపోతాయి. దీంతో మలబద్ధకం పెరిగిపోతుంది. కార్బోహైడ్రేట్లు కూడా తినే ఫుడ్‌లో ఉండేట్లు చూసుకోవాలి. ఫైబర్ ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. అన్నింటిని కూడా సరిగ్గా బ్యాలెన్స్ చేయాలి. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫైబర్ వంటివి శరీరానికి మితంగా అందేలా చూసుకోవాలి.
బాడీకి వేడి చేయడం
ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్నిసార్లు బాడీ వేడికి గురవుతుంది. అధికంగా చికెన్, మటన్, గుడ్లులో ప్రొటీన్ ఉంటుంది. వీటిని లిమిట్‌లో మాత్రమే తీసుకోవాలి. అధికంగా తీసుకోవడం వల్ల కొన్నిసార్లు ఒంటి నొప్పులు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటిని లిమిట్‌లో మాత్రమే తీసుకోవాలి. ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.