Prerna Jhunjhunwala: యాపారం అంటే మరేంటో కాదు.. జనాల అవసరాలు తెలుసుకోవడం. వాటికి అనుగుణంగా పరిష్కార మార్గాన్ని చూపటం. కాలం మారుతున్న కొద్ది కొత్త కొత్త అవసరాలు పుట్టుకొస్తున్నాయి. అవసరాల ఆధారంగా విభిన్నమైన వ్యాపారాలు తెరపైకి వస్తున్నాయి.. వెనుకటి రోజుల్లో బయట తిండి తినడమే నామోషీగా ఉండేది. ఇప్పుడు బయట తిండి ఇంట్లోకి తెచ్చేందుకు ఏకంగా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు పుట్టుకొచ్చాయి. వందల కోట్ల వ్యాపారాన్ని చేస్తున్నాయి. వేల మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. అందుకే అవసరాల ఆధారంగానే పారాలు పుడతాయి, అవి సరైన దిశలో వెళ్ళినప్పుడే లాభాలు వస్తాయి అంటారు ప్రముఖ వ్యాపారవేత్త వారెన్ బఫెట్. ఇప్పుడు కాలం మారింది కాబట్టి వ్యాపార సరళి కూడా పూర్తిగా మారిపోయింది. అలాంటి మార్పులను ఒడిసి పట్టుకున్న ఒక యువతి కొత్తగా ఆలోచించింది. ఎవరూ ఊహించని దిశలో ప్రయాణం చేసింది. చివరికి అందులో విజయం సాధించింది. మనదేశంలో పుట్టినప్పటికీ సింగపూర్ దేశంలో విజయ జెండా పాతింది.
ప్రేరణ ఝున్ ఝున్ వాలా.. భారతదేశానికి చెందిన పారిశ్రామికవేత్త. అయితే సొంత దేశంలో విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగిన తర్వాత.. సింగపూర్ లోనూ సత్తా చాటాలని వినూత్నమైన వ్యాపారానికి నడుం బిగించింది. సింగపూర్ దేశంలో పిల్లల కోసం లిటిల్ పాడింగ్ టన్ అనే ప్రీ స్కూల్ ప్రారంభించింది. పిల్లల అభిరుచులకు అనుగుణంగా స్కూల్లో మార్పులు చేర్పులు చేసింది. ఫలితంగా ఆ స్కూలు చాలా పాపులర్ అయింది. ఇక్కడితో ఆగకుండా ఆమె మొబైల్ యాప్ కూడా ప్రారంభించింది. ఇప్పుడు దానికి విశేషమైన ఆదరణ లభిస్తోంది.
లిటిల్ పాడింగ్ టన్ ప్రీ స్కూల్ నిర్వహిస్తూనే కోవిడ్ సమయంలో క్రియేటివ్ గెలీలియో అనే మొబైల్ యాప్ ప్రారంభించింది. ఇది మూడు నుంచి 8 సంవత్సరాల పిల్లలకు విద్యను అందించేందుకు ప్రారంభించిన స్టార్టప్. అప్లికేషన్ ను భారత ఉపఖండంలో దాదాపు కోటి ఉంది దాకా డౌన్లోడ్ చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ యాప్ లో వీడియోలు, గేమిఫికేషన్, వ్యక్తిగతీకరించిన అభ్యాస ప్రక్రియల ద్వారా పిల్లలకు చదువులో సహాయం చేస్తుంది. పిల్లలకు ఇష్టమైన పాత్రులైన చక్ర, బాహుబలి, శక్తిమాన్, బిగ్ బీస్ జూనియర్ తదితర క్యారెక్టర్లు పాఠాలు చెబుతాయి.
ఎటువంటి వ్యాపార నేపథ్యం లేకుండానే
ప్రేరణ ఇంటి పేరు ఝున్ ఝున్ వాలా ను దివంగత స్టాక్ ఎక్స్చేంజ్ ఎనలిస్ట్ రాకేష్ ఝున్ ఝున్ వాలా కు బంధువు అవుతారని అందరూ అనుకుంటారు. కానీ వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. ప్రేరణ న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి సైన్స్ లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. ఎటువంటి వ్యాపార నేపథ్యమే కాదు, వ్యాపార కోర్సులు కూడా ఆమె చదవలేదు. భారత్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసిన తర్వాత ఈ కంపెనీలు ప్రారంభించింది. ఈ కంపెనీ గత ఏడాది ఫౌండింగ్ రౌండ్లో సుమారు 60 కోట్లు సమీకరించింది. 40 మిలియన్ డాలర్లు దాదాపు 330 కోట్ల వ్యాల్యూషన్ తో ఈ కంపెనీ రౌండ్ పెంచింది.
ఇక తన కంపెనీల అభివృద్ధికి సంబంధించి తక్కువ మార్కెటింగ్ ఖర్చులతో ప్రేరణ పూర్తి చేసింది. 30 మంది సిబ్బంది తో పని ప్రారంభించిన ప్రేరణ.. తర్వాత లాభాలు రావడంతో సిబ్బందిని 60 మందికి పెంచుకుంది. సింగపూర్ మాత్రమే కాకుండా ఇండోనేషియా, వియత్నాం దేశాలలో సంస్థలను ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రస్తుతం ప్రేరణ సింగపూర్ వెంచర్లో ఏకంగా ఏడు పాఠశాలలు ఉన్నాయి. డిమాండ్ భారీగా ఉన్న నేపథ్యంలో వీటి సంఖ్య మరింత పెంచాలని ఆమె అనుకుంటున్నది. ఇక పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆన్ లైన్ లో విద్యను బోధించేందుకు ఆమె భారీ కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే విస్తృతంగా ఉపాధ్యాయులను నియమించుకునేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.