Pawan Kalyan Shoes: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం గా ఉన్న చిత్రం ‘బ్రో ది అవతార్’. ‘భీమ్లా నాయక్’ చిత్రం తర్వాత సుమారుగా ఏడాది గ్యాప్ తీసుకొని ఆయన చేస్తున్న చిత్రం ఇది. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా సాయి ధరమ్ తేజ్ కూడా నటించాడు.కేవలం ఒక్క సాంగ్ రెండు ఫైట్స్ షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. దీనికి పవన్ కళ్యాణ్ 5 రోజుల డేట్స్ ని కేటాయిస్తున్నారు, ప్రస్తుతం #OG సినిమాతో పాటుగా ‘బ్రో’ షూటింగ్ కూడా సమాంతరం గా జరుగుతుంది.
ఇందులో హీరోయిన్స్ గా ప్రియా ప్రకాష్ వారియర్ మరియు కేతిక శర్మ నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో 5 పాటలు మరియు ఒక ఐటెం సాంగ్ ఉంటుందట.ఇప్పటికే పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ విడుదల అయ్యాయి, వీటికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈరోజు కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కలిసి ఉన్న పోస్టర్ ని విడుదల చేసారు. సాయి ధరమ్ తేజ్ చేతులు కట్టుకొని పవన్ కళ్యాణ్ వెనుక నిలబడగా,పవన్ కళ్యాణ్ స్టైల్ గా బైక్ మీద కాలు పెట్టుకుంటాడు. ఈ పోస్టర్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకర్షించింది. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ ధరించిన విచిత్రమైన బూట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సగం తెలుపు మరియు సగం నలుపు తో ఉన్న ఈ బూట్ల ధర ఎంతో కనుక్కోవడానికి ఫ్యాన్స్ గూగుల్ చేయగా , వాటి రేట్లు చూసి వాళ్ళ మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఈ బూట్ల ధర అక్షరాలా లక్ష రూపాయిల పైమాటే అట,అంటే మంచు విష్ణు హీరో గా నటించిన ‘జిన్నా’ మూవీ ఓవర్సీస్ కలెక్షన్స్ కంటే ఎక్కువ అంటూ సోషల్ మీడియా లో ట్రోలింగ్ చేస్తున్నారు ఫ్యాన్స్.