https://oktelugu.com/

Pregnancy: గర్భిణులు కొబ్బరి నీరు తాగవచ్చా? తాగితే ఏమవుతుంది?

గర్భిణిగా ఉన్నప్పుడు ఎవరు ఏ ఆరోగ్య జాగ్రత్తలు చెప్పిన పాటిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు కొబ్బరి నీరు తాగమని చెబుతుంటారు. సాధారణంగా కొబ్బరి నీరు ఆరోగ్యానికి మంచిదే. కానీ గర్భిణులు తాగకూడదని కొందరు, మరికొందరు తాగవచ్చని అంటుంటారు. అసలు గర్భిణులు కొబ్బరి నీరు తాగవచ్చా? తాగితే ఏమవుతుందనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 16, 2024 / 02:36 AM IST

    pregnancy

    Follow us on

    Pregnancy: గర్భం దాల్చినప్పటి నుంచి మహిళలు ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తినే ఆహారం నుంచి చేసే ప్రతి పనిలో కూడా జాగ్రత్త వహిస్తారు. తల్లి కావడం అనేది గొప్ప వరం. ఇలాంటి సమయంలో మహిళలు జాగ్రత్త వహించక తప్పదు. గర్భిణిగా ఉన్నప్పుడు మహిళలు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. వాంతులు, సరిగ్గా ఫుడ్ తినాలనిపించకపోవడం, మలబద్దకం, వెన్నునొప్పి వంటి సమస్యలన్ని కనిపిస్తాయి. ఈ సమయంలో మహిళలు పోషకాలు ఉండే ఆహారాలు మాత్రమే తినాలి. ఎందుకంటే ఆ ఫుడ్ బట్టి పిల్లలు ఆరోగ్యంగా పుడతారని వైద్య నిపుణులు చెబుతుంటారు. సాధారణంగా గర్భిణులు మానసిక, శారీరక సమస్యలతో కాస్త ఇబ్బంది పడతారు. అయితే ఈ సమస్యలన్నీ ఎవరికైనా సాధారణమే. గర్భిణిగా ఉన్నప్పుడు ఎవరు ఏ ఆరోగ్య జాగ్రత్తలు చెప్పిన పాటిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు కొబ్బరి నీరు తాగమని చెబుతుంటారు. సాధారణంగా కొబ్బరి నీరు ఆరోగ్యానికి మంచిదే. కానీ గర్భిణులు తాగకూడదని కొందరు, మరికొందరు తాగవచ్చని అంటుంటారు. అసలు గర్భిణులు కొబ్బరి నీరు తాగవచ్చా? తాగితే ఏమవుతుందనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    ఆరోగ్యానికి మేలు చేసే కొబ్బరి నీరును గర్భిణులు తాగవచ్చు. అయితే మొదటి ఐదు నెలల వరకు గర్భిణులు కొబ్బరి నీరు జోలికి వెళ్లకూడదు. ఎందుకంటే ఈ సమయంలో కొబ్బరి నీరు తాగితే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. గర్భిణులు ఎప్పుడు కొబ్బరి నీరు తాగాలన్నా కూడా డాక్టర్ల పర్మిషన్‌తో మాత్రమే తాగాలి. కొబ్బరి నీరు గర్భిణుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు బాడీ డీహైడ్రేషన్ కాకుండా కాపాడతాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు గుండెల్లో మంట వంటివి రాకుండా కాపాడతాయి. సాధారణంగా గర్భిణులకు మలబద్ధకం అనేది వస్తుంది. ఇలాంటి సమయాల్లో కొబ్బరి నీరు తాగడం వల్ల కాస్త రిలాక్స్‌గా ఉంటుంది. అలాగే శరీరంలో ఎలక్ట్రోలైట్లను పెంచుతుంది. జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఎక్కువగా మాత్రం తాగకూడదు. కాస్త మితంగానే తాగాలి. ఎందుకంటే ఎక్కువగా తాగితే డయాబెటిస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇందులోని చక్కెరలు గర్భధారణ సమయంలో తీసుకోవడం వల్ల వాటి స్థాయిలు పెరుగుతాయి. దీంతో మధుమేహం సమస్య వస్తుంది. కాబట్టి తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి.

    గర్భిణులు వారానికి ఒక రెండు గ్లాసుల కొబ్బరి నీరు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఎక్కువగా కొబ్బరి నీరు తాగడం వల్ల కడుపు నొప్పి, అతిసారం వచ్చే ప్రమాదం ఉంది. కొందరికి పడక విరేచనాలు కూడా అయ్యే ప్రమాదం ఉంది. కొబ్బరి నీటిలో ఉండే సోడియం రక్తపోటును కూడా పెంచుతుంది. అయితే కొబ్బరి నీరు గర్భిణులు తాగడం వల్ల పుట్టే పిల్లలు తెల్లగా పుడతారని అంటుంటారు. అయితే ఇందులో నిజం లేదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే పుట్టే పిల్లలు జన్యుపరమైన కారణాలు, తల్లి, తండ్రి ఉండే వాటి బట్టి పుడతారు. అంతే కానీ కొబ్బరి నీరు తాగడం వల్ల తెల్లగా పుడతారనే దాంట్లో నిజం లేదని నిపుణులు చెబుతున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.