https://oktelugu.com/

Rainy Season Precautions: వానకాలంలో జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే సింపుల్ గా ఇలా చేయండి

వర్షాకాలంలో నీటి వల్ల చాలా రోగాలు వస్తాయి. 50 శాతం రోగాలు మంచినీరు వల్ల వస్తాయని చాలా మందికి తెలియదు. వర్షాకాలంలో కొత్తనీరు వస్తుంది. అందుకే నీటిలో క్రిములు ఎక్కువవుతాయి. అందుకే మనం కాచి చల్లార్చిన నీటిని తాగడం ఉత్తమం. నీటిని ఫిల్టర్ చేసుకోవడం మంచిదే. కూరగాయలను కూడా బాగా కడగాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : July 16, 2023 / 03:01 PM IST

    Rainy Season Precautions

    Follow us on

    Rainy Season Precautions: వర్షాకాలంలో జబ్బులు ఎక్కువగా వస్తాయి. దోమల ప్రభావం అధికంగా ఉండటంతో కలరా, మశూచి, డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు ఎక్కువగా వచ్చే కాలం ఇదే. దీంతో ఈ కాలంలో మన రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. తద్వారా వ్యాధులు సోకుతాయి. జీవక్రియ పనితీరు మందగిస్తుంది. పోషకాలతో కూడిన ఆహారాలు తీసుకోవడం మంచిది. దీంతో రోగాలు రాకుండా చేసుకోవచ్చు.

    శుభ్రత

    వర్షాకాలంలో శుభ్రతకు పెద్దపీట వేయాలి. ఎందుకంటే ఈ కాలం ఈగల కాలం. ఎటు చూసినా ఈగలే దర్శనమిస్తుంటాయి. దీంతో ఆహారాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మనం తీసుకునే ఆహారాలు కలుషితమైతే విష జ్వరాలు రావడం ఖాయం. క్రిములు మన దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోకపోతే ఆస్పత్రి పాలు కావడం తథ్యం.

    తాగునీరు

    వర్షాకాలంలో నీటి వల్ల చాలా రోగాలు వస్తాయి. 50 శాతం రోగాలు మంచినీరు వల్ల వస్తాయని చాలా మందికి తెలియదు. వర్షాకాలంలో కొత్తనీరు వస్తుంది. అందుకే నీటిలో క్రిములు ఎక్కువవుతాయి. అందుకే మనం కాచి చల్లార్చిన నీటిని తాగడం ఉత్తమం. నీటిని ఫిల్టర్ చేసుకోవడం మంచిదే. కూరగాయలను కూడా బాగా కడగాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి.

    ఆహారం విషయంలో..

    వర్షాకాలంలో ఆహారం త్వరగా పాడవుతుంది. మిగిలిపోయిన ఆహారం తినకపోవడమే బెటర్. పండ్లు, కూరగాయలను కూడా బాగా కడిగిన తరువాతే తినాలి. వాన కాలంలో ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందే. సాధ్యమైనంత వరకు శుభ్రంగా ఉంటేనే తినాలి. అపరిశుభ్రంగా ఉన్న ఆహారాలు తింటే రోగాలు రావడం జరుగుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండటమే మన ఆరోగ్యానికి రక్షణ.

    దోమల ద్వారా..

    దోమల ద్వారా అనేక వ్యాధులు సంక్రమిస్తాయి. డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి రోగాలు దోమల కాటు వల్లే వస్తాయి వర్షాకాలంలో దోమల ప్రభావం అధికంగా ఉంటుంది. నీరు నిలువ ఉండే ప్రాంతాల్లో అవి పెరిగి మనల్ని కుట్టడం ద్వారా వ్యాధులు వ్యాపిస్తాయి. వీటి నుంచి రక్షించుకోవడానికి సరైన దుస్తులు ధరించాలి. క్రీములు రాసుకోవాలి. దోమతెరలు వాడాలి.