https://oktelugu.com/

Potato peel chips recipe: బంగాళం దుంపలతో ఈ స్నాక్స్.. అదిరిపోయేలా చేయొచ్చట.. వైరల్ వీడియో

సాధరణంగా బంగాళం దుంప తొక్కలను తీసేసి లోపల గుజ్జుతో కర్రీని తయారు చేసుకుంటారు. బంగాళ దుంపను టమాటాతో పాటు మిక్స్ కర్రీ చేసుకుంటాం. అలాగే బంగాళం దుంపతో నోరూరించే చిప్స్ ను తయారు చేసుకుంటూ ఉంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 13, 2023 / 04:13 PM IST
    Follow us on

    Potato peel chips recipe: కాలం మారుతున్న కొద్దీ కొత్త విషయాలు అందుబాటలోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆహారంపై పలువురు పరిశోధనలు చేసి కొత్త కొత్త వంటకాలను సృష్టిస్టున్నారు. ఇప్పటివరకు కూరగాయలకు సంబంధించిన చాలా వరకు పైన తొక్క తీసేసి లోపల ఉన్నదానితో వండుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ తొక్కలు వరమయ్యాయి. కూరగాయల తొక్కలతో కొత్త ఆహార పదార్థాలను రుచికరంగా తయారు చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి బంగాళం దుంప తొక్కలతో టేస్టీ స్నాక్స్ ను తయారు చేశారు. ఇదేదో పర్సనల్ గా చేసిన వంటకం కాదు.. సాక్షాత్తూ ఆహార నిపుణుల మధ్య తయారు చేశాడు. దీంతో వారి ప్రశంసలు మాములుగా లేవు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

    సాధరణంగా బంగాళం దుంప తొక్కలను తీసేసి లోపల గుజ్జుతో కర్రీని తయారు చేసుకుంటారు. బంగాళ దుంపను టమాటాతో పాటు మిక్స్ కర్రీ చేసుకుంటాం. అలాగే బంగాళం దుంపతో నోరూరించే చిప్స్ ను తయారు చేసుకుంటూ ఉంటారు. ఇవి తయారు చేసేటప్పుడు పైన ఉన్న తొక్కను తీసేసి చెత్తలో పడేస్తారు. కానీ ఇప్పుడు అలా పడేసిన తొక్కలతో కూడా రుచికరమైన ఫుడ్ ను తయారు చేసుకోవచ్చని ఒక చెప్ నిరూపించాడు.

    ఇది తయారు చేసుకోవడం సింపుల్. బంగాళం దుంప తొక్కలను కొన్నింటిని తీసుకోవాలి. ఆ తరువాత వాటికి ఉప్పు, కారం మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసిన వాటిని మైక్రో ఓవెన్ లో పెట్టాలి. ఇలా కాసేపు పెట్టిన తరువాత స్నాక్స్ లా తీసుకోవచ్చు. అయితే ఈ వంటకాన్ని రియాల్టీ షో కంటెస్టెంట్ సూరజ్ థాపా చేసి చూపించాడు. ఈ సందర్భంగా కొందరు ఆహార నిపుణులు ఆయన చేసిన వంటకాన్ని తిని లొట్టలేశారు. ఇలా వేస్టుగా పోయే వాటిలో మంచి ఆహారాన్ని తయారు చేశావని కొనియాడారు. ఆ వీడియో ను మీరు కూడా చూసేయండి..