FD Interest Rates 2024: భవిష్యత్తులో డబ్బులు ఆదా చేసుకోవాలి అనుకునేవారికి పోస్టాఫీస్ లో ఫిక్స్ డ్ డిపాజిట్ లేదా పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ లను ఎక్కువగా ఎంచుకుంటారు. అయితే బ్యాంక్ డిపాజిట్ లాగా ఇక్కడ కూడా డబ్బును వడ్డీ రేటు, నిర్ణీత వ్యవధి అంటూ డిపాజిట్ చేసుకోవచ్చు. అంటే ఈ పెట్టబుడి వ్యవధి ఆధారంగా వడ్డీ రేటు పెరుగుతుంది. ఆ మొత్తాన్ని 1,,2,3,4,5 సంవత్సరాలకు నిర్ణయించవచ్చు. వడ్డీని మూడు నెలలకోసారి లెక్కిస్తారు.
కానీ సంవత్సరానికి మాత్రమే చెల్లిస్తారు. వడ్డీపై టీడీఎస్ వర్తిస్తుందట. 5సంవత్సరాల పాటు పీవోఎఫ్డీ ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తోంది. అయితే కనీసం రూ. 200 అయినా పెట్టుబడి పెట్టాలట. ఒక్క ఖాతాకు ఒక్క ఫిక్స్ డ్ డిపాజిట్ మాత్రమే చేయవచ్చు. కానీ మరిన్ని ఖాతాలు కూడా ఓపెన్ చేయవచ్చట. కావాలనుకుంటే ఒక పోస్టాఫీస్ నుంచి మరొక పోస్టాఫీస్ కు బదిలీ చేయవచ్చు.
అయితే దీన్ని మొదలు చేసిన తర్వాత మొదటి ఆరునెలలు డ్రా చేసుకోవడం కుదరదు. ఆ తర్వాత కావాలనుకుంటే ప్రీ మెచ్యూర్ విత్ డ్రా చేసుకోవచ్చు. కానీ పెనాల్టీ ఉంటుందట. గడువు ముగిసిన తర్వాత రినవల్ చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టాఫీస్ ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు ప్రస్తుత వడ్డీ రేట్ల ప్రకారం 1 సంవత్సరానికి చేసిన డబ్బు 6.90 శాతం వడ్డీ వస్తుందట.
ఒకటి నుంచి 3 సంవత్సరాలకు 7 శాతం వడ్డీ. 3 నుంచి 5 సంవత్సరాలకు 7.50 శాతం వడ్డీ వస్తుందట. అంటే ఒక సంవత్సరం తర్వాత 1,775 వడ్డీని పొందుతారు. అంటే 25వేల ఫిక్స్ డ్ డిపాజిట్ కు టర్మ్ ఎండ్ లోపు రూ. 26,775 దాకా పొందవచ్చు అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం.. రిస్క్ లేని ఈ పోస్టాఫీస్ లో పెట్టుబడి పెట్టేయండి. వీటికోసం మీదగ్గర ఉన్న పోస్టాపీస్ ను సంప్రదించండి.