Naga Chaitanya , Shobhita : వచ్చే నెల నాల్గవ తేదీన నాగ చైతన్య రెండవ పెళ్లి ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పిలవబడుతున్న ఈ జంటకి సంబంధించిన పెళ్లి వేడుకను లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి మీడియా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. అయితే ఈమధ్య కాలం లో సెలెబ్రిటీల పెళ్లి వేడుకలను డాక్యుమెంటరీ గా చేసి ఓటీటీ సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ సంస్థ నయనతార, విగ్నేష్ వివాహ మహోత్సవాన్ని ఒక డాక్యుమెంటరీ చేసి విడుదల చేయగా, ఆ డాక్యుమెంటరీ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టాప్ లో ట్రెండ్ అవుతున్న ఈ డాక్యుమెంటరీ కి అప్పుడే రెండు మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయట. దీంతో నెట్ ఫ్లిక్స్ సంస్థ మరికొన్ని సెలెబ్రిటీల పెళ్లిళ్లకు సంబంధించిన డాక్యుమెంటరీలు చేయడానికి సిద్ధంగా ఉంది.
అందులో భాగంగా నాగ చైతన్య, శోభిత వివాహానికి సంబంధించి డాక్యుమెంటరీ గా తీయాలని నెట్ ఫ్లిక్స్ సంస్థ అమితాసక్తిని చూపిస్తుందట. కేవలం ఒక్క నెట్ ఫ్లిక్స్ సంస్థ మాత్రమే కాదు, అమెజాన్ ప్రైమ్ , సోనీ లివ్ వంటి ఓటీటీ సంస్థలు కూడా ఈ డాక్యుమెంటరీ కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ అయితే ఏకంగా 15 కోట్ల రూపాయిలు ఈ డాక్యుమెంటరీ కోసం ఈ జంటకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందట. మరి అక్కినేని కుటుంబం అందుకు ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఒప్పుకుంటే మాత్రమే మీడియా కి లైవ్ కావేరేజి ఇచ్చేందుకు అనుమతి లేదు. కేవలం లైవ్ కవరేజి మాత్రమే కాదు, అసలు ఈ పెళ్ళికి సంబంధించిన చిన్న వీడియో కూడా సోషల్ మీడియా లో అప్లోడ్ చేసేందుకు వీలు లేదు. నెట్ ఫ్లిక్స్ సంస్థ అగ్రిమెంట్ ఇలా ఉంటుంది. అందుకే నయనతార పెళ్ళికి సంబంధించి చిన్న బిట్ వీడియో కూడా మొన్నటి వరకు సోషల్ మీడియా లో రాలేదు.
ఇది ఇలా ఉండగా ఈ పెళ్లి వేడుక పెద్దగా హంగులు, ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా చేయాలనీ నాగార్జున, శోభిత లు రిక్వెస్ట్ చేశారట. కేవలం అక్కినేని కుటుంబానికి సంబంధించి 300 మంది, అలాగే సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు సంబంధించిన దిగ్గజాలు, నాగార్జున మనసుకు బాగా దగ్గరైన వాళ్ళు మాత్రమే ఈ వివాహ మహోత్సవానికి హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. శోభిత దూళిపాళ్ల కుటుంబం వైజాగ్ లో ఉంటుంది కాబట్టి, పెళ్ళికి ముందు ఆమెకు జరగాల్సిన కార్యక్రమాలు మొత్తం వైజాగ్ లోనే జరిగాయి. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో ఆమె అప్లోడ్ చేయగా తెగ వైరల్ గా మారింది. మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్న ఈమె, మన తెలుగు ఆడియన్స్ కి ‘గూఢచారి’ చిరం ద్వారా పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఎక్కువగా ఈమె బాలీవుడ్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ వచ్చింది.