Pomegranate peel: దానిమ్మ పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని డైలీ తినడం వల్ల శరీరంలో తొందరగా రక్తం ఏర్పడుతుందని నిపుణులు చెబుతుంటారు. దీని గింజలతో జ్యూస్ చేసి తాగితే శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. దానిమ్మ గింజల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బలహీనతను తొలగించి అనేక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇందులోని ఫైబర్, జింక్, పొటాషియం, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడతాయి. దానిమ్మ గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే సాధారణంగా చాలా మంది దానిమ్మ గింజలను తిని తొక్కలను పడేస్తుంటారు. మీరు కూడా ఇలానే చేస్తున్నట్లయితే ఇక మానుకోండి. ఎందుకంటే కేవలం గింజలతోనే కాకుండా దానిమ్మ తొక్కలతో కూడా బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయి. తొక్కల్లో కూడా పోషకాలు మెండుగా ఉంటాయి. దానిమ్మ తొక్కలను పడేయకుండా వాటితో టీ చేసి తాగితే శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వీటితో పాటు ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే?
గుండె ఆరోగ్యంగా..
దానిమ్మ తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ తొక్కలను ఉపయోగించడం వల్ల బరువు తగ్గుతారు. అలాగే గుండె పోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. సాధారణ టీ తాగే బదులు డైలీ ఈ దానిమ్మ తొక్కలతో చేసిన టీని తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు.
రోగనిరోధక శక్తి పెరగడం
ఈ తొక్కల్లో విటమిన్లు, పోషకాలు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈ టీని డైలీ తాగడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి విముక్తి చెందవచ్చు. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
అల్జీమర్స్ రాకుండా..
అల్జీమర్స్‌తో బాధపడుతున్న వారికి అల్జీమర్స్ చక్కని మందు. ఈ వ్యాధిని తగ్గించే మూలకాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. ఈ తొక్కల్లో యాంటీ న్యూరోడెజెనరేటివ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అల్జీమర్స్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
బరువు తగ్గడం
బరువు తగ్గాలనుకునే వారికి దానిమ్మ తొక్కలు బాగా ఉపయోగపడతాయి. స్థూలకాయంతో బాధపడేవారు రోజుకు ఒకసారి అయిన ఈ దానిమ్మ తొక్క టీ తాగితే ఒంట్లో కొవ్వు అంతా తగ్గిపోతుంది.
దానిమ్మ తొక్క టీ ఎలా తయారు చేయాలంటే?
మొదటిగా దానిమ్మ తొక్కలను శుభ్రం చేసుకోవాలి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండలో ఆరబెట్టాలి. తొక్కలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. ఈ పొడిని గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఒక పాత్రలో గ్లాసు నీరు వేసి దానిమ్మ తొక్కల పొడి వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత వడబోసి తేనె, నిమ్మరసం కలిపి తాగితే ఫలితం ఉంటుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.