Homeలైఫ్ స్టైల్Pitru Paksha 2023: పితృపక్షం.. ఈ సమయంలో ఏం చేయాలో తెలుసా?

Pitru Paksha 2023: పితృపక్షం.. ఈ సమయంలో ఏం చేయాలో తెలుసా?

Pitru Paksha 2023: పితృపక్షం అంటే మన పూర్వీకుల కోసం ఓ పక్షం రోజులు ఆచరించే మాసం. ప్రతీ ఏడాది భాద్రపద పౌర్ణమి నుంచి ఈ పక్షం మొదలవుతుంది. పితృపక్షంలో చనిపోయిన పెద్దవారు తిరిగి ఈ భూమ్మిదకు వస్తారని నమ్మకం. అందుకే ఈ పక్షం రోజులు కొన్ని నియమాలను వారి ఆత్మశాంతి కోసం పాటిస్తారు. ఈ ఏడాది 2023 సెప్టెంబర్‌ 29న పితృపక్షం ప్రారంభం కానుంది. అయితే, ఈ పక్షంలో మగవారు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి.

ఈ పక్షంలో చేసేవి..
ఈ పక్షంలో అందరూ, ముఖ్యంగా మగవారు చనిపోయిన తమ పూర్వీకులకు ఆత్మశాంతి కోసం తర్పణం, శార్ధం పెడతారు. దీంతో వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని నమ్ముతారు. పదిహేను రోజులు సంతాప దినాలుగా పాటిస్తారు. ఈ పక్షం రోజులు ఆత్మ శాంతించని తమ చనిపోయిన పెద్దలు భూమిపైకి తమను చూడటానికి వస్తారని నమ్మకం. కొన్ని నియమాలు పాటించి వాటిని ఆచరిస్తే వారికి మోక్షం కలుగుతుందని పిండ ప్రదానం చేస్తారు. కాకులు చనిపోయిన వారికి గుర్తు కాబట్టి వీటికి కూడా ఏదైనా ఆహారం పెడతారు. ఆ పిండాన్ని కాకులు తింటే తమ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుందని అంటారు. ఒకవేళ అవి ఈ ఆహారం ముట్టుకోకపోతే ఆత్మ శాంతించలేదని భావిస్తారు.

ఇవి చేయకూడదు..
ఇవన్ని ఒక ఎత్తు అయితే… ఈ పక్షం రోజులు మగవారు కట్టింగ్, షేవింగ్‌ చేసుకోరు. ఎందుకంటే ఈ దినాలను సంతాప దినాలుగా భావిస్తారు. ముఖ్యంగా పితృపక్షం ముగిసే వరకు ఏ శుభకార్యాలు, కొత్త పనులకు కూడా పూనుకోరు. అంటే కొత్త బట్టలు, వస్తువులు, బంగారం, ఏ ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేయరు. కొత్త ఇల్లు, వాహనాలు కూడా కొనుగోలు చేయరు.

ఆహారం విషయంలో భిన్నంగా..
ఇంకా ఈ పక్షంలో కొందరు ఉల్లిపాయ, వెల్లుల్లి, నాన్‌ వెజ్‌ వంటి చికెన్, మటన్, చేపలు, ఘటైన వాసన వచ్చే ఇతర ఆహార పదార్థాలను కూడా తీసుకోరు. కొంతమంది ఇళ్లలో పూర్తిగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. ప్రార్థనలు, ఆచారాలు పాటించడం వల్ల వారి ఆత్మకు శాంతి కలిగి ముక్తి కలిగుతుందని నమ్మకం. కొంత మంది తమ పెద్దలకు ఇష్టమైన నాన్‌వెజ్, వెజ్‌ వంటకాలు చేసి పిండప్రదానం చేస్తారు. మొత్తానికి చెప్పాలంటే ఏవైనా పితృదోషాలు ఉంటే ఉపశమనం కలుగుతుందంటారు. అయితే ఈ కథనం ప్రజల విశ్వాసాలు మాత్రమే. ఇది వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version