https://oktelugu.com/

Pink Salt: బీపీ ఉన్నవారు పింక్ సాల్ట్ తినవచ్చా? తింటే ఏమవుతుంది?

ఈ రోజుల్లో కొందరు ఆరోగ్యంగా ఉండాలని పింక్ సాల్ట్‌ను వాడుతున్నారు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరూ భావిస్తారు. అయితే బీపీ ఉన్నవారు ఉప్పు తక్కువగా తినాలని నిపుణులు సూచిస్తుంటారు. మరి బీపీ ఉన్నవారు పింక్ శాల్ట్ తినవచ్చా? తింటే ఏమవుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 16, 2024 / 04:19 AM IST

    Pink Salt

    Follow us on

    Pink Salt: వండిన వంటలు టేస్టీగా ఉండాలంటే తప్పకుండా ఉప్పు ఉండాలి. ఉప్పు లేకపోతే అసలు ఏ వంటలు కూడా తినాలని ఉండదు. వంటల్లో ఈ ఉప్పు ఎక్కువైనా ప్రమాదమే? తక్కువైనా కూడా ప్రమాదమే. కూరల్లో ఉప్పు అనేది సరిగ్గా లేకపోతే అసలు వంటలకు టేస్ట్ కూడా ఉండదు. అయితే ఉప్పు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ బీపీ ఎక్కువగా ఉన్నవారు ఉప్పును తక్కువగా తీసుకోవాలి. పూర్తిగా కూడా ఉప్పు తీసుకోకపోతే లో బీపీ కూడా వస్తుంది. అయితే పూర్వకాలంలో దంపుడు ఉప్పును వాడేవారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఈ రోజుల్లో చాలా మంది సాల్ట్‌ను వాడుతున్నారు. మార్కెట్లో దొరికే సాల్ట్‌లో ఎన్నో హానికర రసాయనాలను కలిపి తయారు చేస్తున్నారు. వీటివల్ల కూరలు టేస్టీగా లేకపోవడంతో పాటు అనారోగ్య సమస్యలను కూడా తెచ్చిపెడుతోంది. అయితే ఈ రోజుల్లో కొందరు ఆరోగ్యంగా ఉండాలని పింక్ సాల్ట్‌ను వాడుతున్నారు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరూ భావిస్తారు. అయితే బీపీ ఉన్నవారు ఉప్పు తక్కువగా తినాలని నిపుణులు సూచిస్తుంటారు. మరి బీపీ ఉన్నవారు పింక్ శాల్ట్ తినవచ్చా? తింటే ఏమవుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

     

    బీపీ ఉన్నవారికి పింక్ సాల్ట్ బాగా ఉపయోగపడుతుందని, దీన్ని తినవచ్చని అందరూ అనుకుంటారు. కానీ ఇందులో కాస్త వైట్ సాల్ట్, రిఫైన్డ్ సాల్ట్, అయోడిన్ మిక్స్ చేస్తారు. ఇందులోని అయోడిన్ బీపీని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీపీ ఉన్నవారు రోజుకి 5 గ్రాముల కంటే ఎక్కువ సాల్ట్ తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో సగం తినడం వారి ఆరోగ్యానికి మంచిది. సోడియం ఎక్కువగా బాడీకి తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయితే ఈ పింక్ సాల్ట్‌లో అర్సెనిక్, మెర్క్యూరీ, లీడ్ వంటివి కూడా ఉన్నాయి. ఇవి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి వీటిని అధిక మోతాదులో అసలు తీసుకోకూడదట. అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. దీంతో గుండె పోటు ప్రమాదాలు, దీర్ఘకాలిక మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా ఉప్పు తీసుకుంటే శరీరంలో కాల్షియం తగ్గిపోతుంది. దీంతో బోలు ఎముకల వ్యాధి, ఆర్థరైటిస్ వంటివి కూడా వచ్చే ప్రమాదం ఉంది.

     

    ఈ పింక్ శాల్ట్‌లో పోషకాలు ఉన్నప్పటికీ అధికంగా తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు. ముఖ్యంగా పింక్ శాల్ట్‌తో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఈ పింక్ శాల్ట్ వల్ల శ్వాసకోశ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే ఈ పింక్ సాల్ట్‌ను వాడాలి. ఆరోగ్యానికి మంచిదని షాప్‌లో కొని తెచ్చి ఈ ఉప్పును వాడవద్దు. ఇలా వాడారో ఇక లెక్కలేనన్ని అనారోగ్య సమస్యల బారిన పడతారు.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.