Viral News : ఏదైనా ఒక ఫొటో అందంగా కనిపిస్తుందంటే దాని వెనుక ఎవరికి కనిపించని ఫొటోగ్రాఫర్ కష్టం ఉంటుంది. వైల్డ్ ఫొటో గ్రాఫర్లు అయితే పక్షులు, జంతువుల ఫొటోలను క్యాప్చర్ చేయాలని తారసపడుతుంటారు. ఈ క్రమంలో వారు ఎంతో కష్టపడుతుంటారు. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు ఎక్కువగా అడవుల్లో తిరుగుతుంటారు. జంతువుల ఎక్స్‌ప్రెషన్స్ అన్ని కూడా తీయాలని అనుకుంటారు. కరెక్ట్ క్యాప్చర్ వచ్చే వరకు ఎన్ని సార్లు అయిన ట్రై చేస్తారు. వారు తీసిన ఫొటోకి ప్రశంసలు రావాలని వారి ఫొటో టాప్‌లో ఉండాలని కలలు కంటారు. ఇలా ప్రాణాలను ఫణంగా పెట్టి మరి ఫొటోలు ఫొటోగ్రాఫర్లు చాలా మందే ఉన్నారు. ఇలాంటి ఫొటోగ్రాఫర్లలో అతిఫ్ సయీద్ ఒకరు. పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన అతిఫ్ సయీద్ ప్రాణాలను ఫణంగా పెట్టి మరి అడవి రాజుతో ఓ ఫొటోను క్లిక్ మనిపించాడు.
సాధారణంగా ఎవరికైనా సింహాన్ని చూస్తేనే భయం వేస్తుంది. అలాంటిది అది మన పైకి వస్తుందంటే.. ఇంకా మన మైండ్ కూడా పనిచేయదు. కానీ అతిఫ్ మాత్రం తన కెమెరాలో అడవి రాజు అందమైన ఫొటోను క్యాప్చర్ చేశాడు. అంతటి భయానక సమయంలో కూడా అతిఫ్ తన ఆత్మ విశ్వాసం కోల్పోకుండా అద్భుతంగా చిత్రీకరించాడు. అతిఫ్ లాహోర్‌లోని సఫారీ పార్క్‌కి 2012లో వెళ్లారు. ఆ సయమంలో ఈ సింహం ఫొటోను చిత్రీకరించాడు. అతిఫ్‌కి వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో సింహం అద్భుతమైన క్యాప్చర్ తీయడానికి దాని దగ్గరకు వెళ్లాడు. ఇంతలో అది అతిఫ్ పైకి వచ్చింది. ఈ క్రమంలో అతను ఆ ఫొటోను తీశాడు. కొన్ని సెకన్ల సమయంలోనే అతని కారు వల్ల తప్పించుకున్నాడు. లేకపోతే అప్పుడే ప్రాణాలు కోల్పోయేవాడు. అంత రిస్క్‌లో కూడా తన ఫొటో క్యాప్చర్ తీశాడంటే అతని కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉందో అర్థం చేసుకోండి.
వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అంటే పిచ్చి ఉన్న వారు ఇలానే రిస్క్ చేసి మరి ఫొటోలు తీస్తుంటారు. వారికి ఏమైనా పర్లేదు. కానీ ఫొటో మాత్రం బాగా రావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఇలాంటి సహజమైన ఫొటోలు చాలా రేర్‌గా ఉంటాయి. కొన్ని జంతువులను సహజంగా ఫొటోలు తీస్తే చాలా బాగుంటాయి. మళ్లీ మళ్లీ అలాంటి క్యాప్చర్లు తీయడం కష్టం. అవి కొన్నిసార్లు మాత్రమే అలా సహజంగా వస్తాయి. ఇలా ప్రపంచంలో ఎందరో ఫొటో గ్రాఫర్లు తీసినవి ఉన్నాయి. ఫొటోగ్రఫీ అనేది ఒక ఆర్ట్. ఎలా ఉన్న దాన్ని అయిన కూడా అందంగా, సహజంగా క్యాప్చర్ చేయాలంటే అది అందరూ చేయలేరు. కొందరు మాత్రమే ఆ సహజ అందాన్ని తెరపైకి చూపించగలరు. అది ఒక్కోరి టాలెంట్ బట్టి ఉంటుంది.
Photographer Atif Saeed took this stunning image of a lion, milliseconds before it charged.
He managed to jump back into his vehicle, fortunately having left the door open pic.twitter.com/xk3aBtZgJd
— Science girl (@gunsnrosesgirl3) September 11, 2023