EMI: బ్యాంకు లోన్ తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది. కానీ దాని ఈఎంఐ కట్టేటప్పుడే ఆవేదన కలుగుతుంది. ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పినా.. కొందరు అనవసరానికి లోన్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇంతకాలం లోన్ తీసుకున్న తర్వాత డబ్బులు కట్టకపోతే ఇంటికి వచ్చి రికవరీ చేసేవారు. కానీ ఇప్పుడు మొబైల్ లాక్ చేసే అవకాశం ఉంది. ఈఎంఐ కట్టకపోతే ఆటోమేటిక్గా ఫోన్ లాక్ అవుతుంది. నేటి కాలంలో ఫోన్ లేకుండా ఎవరు ఉండలేరు. మరి ఒక్కసారిగా ఫోన్ లాక్ అయిపోతే పరిస్థితి ఏంటి? ఇంతకీ లోన్ కట్టకపోతే ఫోన్ ఎవరు లాక్ చేస్తారు?
ఒకప్పుడు ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే చేతిలో డబ్బులు ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు జేబులో ఒక్క రూపాయి లేకపోయినా ఎంత పెద్ద ధర కలిగిన వస్తువును అయినా కొనుగోలు చేయవచ్చు. అందుకు కారణం బ్యాంకులు, సంస్థలు వస్తువులకు సంబంధించిన రుణాలు కూడా ఇవ్వడమే. మొబైల్ నుంచి టీవీ, రిఫ్రిజిరేటర్, సోఫా సెట్ , ఏసీ వంటి వస్తువులు కొనుగోలు చేయడానికి కొన్ని సంస్థలు రుణం ఇస్తున్నాయి. వీటికి సంబంధించిన డబ్బులు నెలనెలా కట్టడం వల్ల పెద్దగా భారం ఉండదని చాలామంది భావిస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఒక్కోసారి ఈఎంఐ కట్టకపోవచ్చు. ఇలాంటి అప్పుడు రుణం తీసుకున్న వ్యక్తికి సంబంధించిన ఫోన్ ను లాక్ చేసే అధికారం వండర్స్ కు ఉంది.
అయితే ప్రస్తుతం దీనిని ప్రపోజల్ మాత్రమే పెట్టారు. దీనిపై అనుమతి వస్తే త్వరలో ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇది అమల్లోకి వచ్చిన తర్వాత.. నిబంధనల ప్రకారమే మొబైల్ ను లాక్ చేస్తారు. అయితే వస్తువులు కొనుగోలు చేసే ముందే కొన్ని సంస్థలు ప్రత్యేకంగా రుణాలు అందిస్తాయి. ఒకేసారి డబ్బులు చెల్లించలేని వారికి ఈఎంఐ పే చేసేవారికి వస్తువులను విక్రయిస్తాయి. ఈ సమయంలో ఒక అగ్రిమెంట్పై సంతకం కూడా తీసుకుంటారు. ఈ సంతకం ప్రకారం మూడు నెలల పాటు ఈఎంఐ చెల్లించకపోతే ఆ తర్వాత ఫోన్ ను లాక్ చేసే అధికారం వారికి ఉంటుంది. వస్తువులు కొనుగోలు చేసే సమయంలోనే కొనుగోలుదారుడి మొబైల్లో ఒక యాప్ ను ఇన్స్టాల్ చేస్తారు. ఈ యాప్ ఆధారంగా వారు ఫోన్ లాక్ చేసే అధికారం ఉంటుంది.
ఫోన్ లాక్ చేయడం వల్ల కొన్ని రకాల యాప్స్ మాత్రమే పనిచేయవు. ఫోన్ కాలింగ్.. మెసేజ్ రిసీవింగ్ వంటి వాటిని వారు లాక్ చేయరు. ఇంస్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి యాప్స్ ను పనిచేయకుండా చేస్తారు. కానీ ఈ కాలంలో ఈ యాప్స్ లేకుండా చాలామంది తట్టుకోలేరు. అందుకే వారు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అందువల్ల ఏవైనా వస్తువులను ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే వాటిపై నిర్లక్ష్యం చేయకుండా నెల నెల చెల్లించడం మంచిది. మరి ముఖ్యంగా ఈ విధానం కేవలం వస్తువులకు కొనుగోలు రుణాలపై మాత్రమే ఉంటుంది. పర్సనల్ లోన్, గృహ రుణానికి ఇవి వర్తించవు.