Phone addiction: ఉదయం లేచిన దగ్గరి నుంచి.. రాత్రి పొద్దుపోయే వరకు మన వెన్నంటే ఉండే సాంకేతిక స్నేహం మొబైల్ అని అనుకోవచ్చు. ఎందుకంటే మొబైల్ వాడకం ఇప్పుడు విపరీతంగా మారిపోయింది. ప్రతి చిన్న విషయానికి మొబైల్ లేకుండా తప్పనిసరి కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా మొబైల్ వాడుతున్నారంటే దీని పరిధి ఎంతో అర్థం చేసుకోవచ్చు. కొందరు మొబైల్ ను వినోదం కోసం వాడుతుంటే.. మరికొందరు ఆర్థిక అవసరాల కోసం వాడుతున్నారు. ఇంకొందరు ఉద్యోగాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇలా వాడిన మొబైల్ వాడకం పరిమితికి దాటితే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా స్మార్ట్ ఫోన్ వాడే వారిపై అధ్యయనం చేయగా షాకింగ్ ఇచ్చే విషయాలు బయటపడ్డాయి.
మైండ్ ఫుల్ నెస్ అనే పత్రికలో స్మార్ట్ ఫోన్ల అతి వాడకంపై అధ్యయనం వివరాలను వెల్లడించారు. రోజువారి పనుల కారణంగా ప్రజలు మొబైల్లో రకరకాలుగా వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 11 దేశాలకు చెందిన 39వేల మందిపై 61 అధ్యయనాలు సమీక్షించారు. వీటి ప్రకారం పదేపదే ఫోన్ను వాడడం వల్ల ఒక మనిషిలో కొత్త రకమైన లక్షణాలు కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఓవరాల్ గా ఎక్కువగా ఫోన్ వాడే వారిలో ఒత్తిడి, విసుగు వట్టితోపాటు వారి భావోద్వేగాల్లో అనేక మార్పులు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఫోన్ వాడడం ఒక సమస్యగానే గుర్తిస్తున్నారు.
నిరంతరం మొబైల్ వాడే వారిలో ఏదైనా ఒక విషయంపై పూర్తిగా నియంత్రణ లేకుండా కోల్పోతున్నారు. ఫోన్ ను అవసరాని కోసం వాడుతున్నామా లేదా కాలక్షేపాని కోసం ఉపయోగిస్తున్నామా అనేది తెలియకుండానే ఫోను ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా కొందరు ఒకసారి మొబైల్ యూస్ చేసిన తర్వాత పక్కన పెట్టి.. మళ్లీ వెంటనే మొబైల్ లో ఏదో సమాచారం కోసం వెతుకుతూ ఉంటారు. ఇది కూడా ఒక ఆరోగ్య సమస్య అని అనుకోవచ్చు. అదేపనిగా ఫోన్ వాడటం వల్ల మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
అయితే ఈ సమస్యల నుంచి బయటపడాలంటే కొన్ని ప్రత్యేక అలవాట్లు ఏర్పాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అదే పనిగా ఫోన్ మాట్లాడకుండా మధ్య మధ్యలో కుటుంబ సభ్యులతో మాట్లాడడం లేదా కాసేపు బయటకు వెళ్లడం వంటివి చేయాలి. బస్సులో ప్రయాణించేటప్పుడు.. ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్ వంక చూడకుండా బుక్ రాయడం.. ఏదైనా భౌతికంగా పనులు చేయడం లాంటివి చేయాలి. ఇలా చేస్తే మెదడు స్వయం శక్తిగా ఆలోచించే గుణం పెరుగుతుంది. ఒక్కోసారి ఎదుటివారి మాట్లాడేటప్పుడు కొందరు వారికి తెలియకుండానే రకరకాల భావోద్వేగాలను వ్యక్తపరుస్తారు. అనవసరంగా నవ్వడం.. చిన్న విషయానికే పెద్దగా కోప్పడం వంటివి చేస్తారు. ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో ఇది మానసికంగా కృంగిపోయేలా చేస్తుంది