Pets: పెంపుడు జంతువులు అంటే చాలా మందికి ఇష్టం. కొందరు సేఫ్టీ అనే కాకుండా సంతోషంగా కోసం పెంపుడు జంతువులను పెంచుకుంటారు. వీటిని పెంచడం చాలా కష్టం. ఎందుకంటే వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫుడ్, క్లీనింగ్ వంటి విషయాల్లో చాలా కేర్‌గా ఉండాలి. అయితే ప్రస్తుతం ఉన్న చలికి మనుషులమే తట్టుకోలేం. అలాంటిది పెంపుడు జంతువులు తట్టుకోవడం చాలా కష్టం. మిగతా సీజన్‌లతో పోలిస్తే చలికాలంలో మాత్రం పెంపుడు జంతువులపై కాస్త ఎక్కువగానే కేరింగ్ చూపించాలి. ఎందుకంటే చలి తీవ్రతకు తట్టుకోవడం చాలా కష్టం. చలికాలంలో వెచ్చగా ఉండటానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో.. అలాగే పెంపుడు జంతువుల విషయంలో కూడా తీసుకోవాలి. మరి అవేంటో తెలియాలంటే స్టోరీ మొత్తం పూర్తిగా చదివేయండి.
వెచ్చగా ఉండేలా చూసుకోవాలి
చలి నుంచి విముక్తి పొందడానికి కొందరు స్వెటర్లు వాడుతుంటారు. కానీ కుక్కలను మాత్రం పట్టించుకోరు. వీటికి కూడా చలి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి వెచ్చగా ఉండే స్వెటర్లు వీటికి కూడా ధరించాలి. అలాగే వీటిని బయటకు తీసుకెళ్లేటప్పుడు కూడా చల్లగాలులు తగలకుండా జాగ్రత్తపడాలి.
ఫుడ్ విషయంలో నియమాలు
పెంపుడు జంతువులు చలికాలంలో ఎక్కువగా ఫుడ్ తింటాయి. ఎందుకంటే వెచ్చదనం కోసం అవి ఎక్కువ క్యాలరీలను బర్న్ చేస్తాయి. కాబట్టి మరీ తక్కువగా, ఎక్కువగా కాకుండా ఫుడ్ పెట్టడం మంచిది. అలాగే వాటికి ఇమ్యునిటీ పవర్ పెరిగేలా పోషకాలు ఉండే ఆహారం పెట్టండి.
నీరు పెట్టాలి
చలికాలంలో మనుషులకు పెద్దగా దాహం వేయదు. అలాగే పెంపుడు జంతువులకు కూడా వేయదు. దీనివల్ల అవి నీరు తాగవు. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి పెంపుడు జంతువులు ఎక్కువగా నీరు తాగే విధంగా చేయాలి. దీనివల్ల అవి అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
బయటకు తీసుకెళ్లవద్దు
చలి తీవ్రత ఉన్నా కూడా కొందరు పెంపుడు జంతువులను వాకింగ్‌కి తీసుకెళ్తుంటారు. బాగా చలి ఉంటే వీటిని తీసుకెళ్లకపోవడం మంచిది. ఎండ ఉన్న సమయంలో తీసుకెళ్లాలి. ఎందుకంటే చలి తీవ్రత వల్ల వాటికి జలుబు, జ్వరం వంటివి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని చలికాలంలో ఎక్కువగా బయటకు తీసుకెళ్లవద్దు.
వైద్య పరీక్షలు
పెంపుడు జంతువులకు కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడూ వాటికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స చేస్తుండాలి. సీజన్ల బట్టి మనుషులు ఎలా ఇన్ఫెక్షల బారిన పడతారో పెంపుడు జంతువులు కూడా అలాగే. కాబట్టి చలికాలంలో వాటి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెక్ చేసి చికిత్స అందించండి. అప్పుడు అవి ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాయి. కొందరు చలికి కనీసం వాటిని పట్టించుకోరు. దీంతో అవి చలి సమస్యలతో ఇబ్బంది పడి ఎక్కువ అయ్యి.. అనారోగ్య సమస్యలతో బాధపడతాయి. కాబట్టి తప్పకుండా ఈ విషయాల్లో జాగ్రత్త వహించండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహాలు తీసుకోగలరు.