Babar Azam: బ్యాట్‌తో దంచికొట్టే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంకు ఈ మధ్య ఏది కలిసి రావడం లేదు. ప్రపంచకప్ టీ20లో జట్టును ఫైనల్ చేర్చిన బాబర్ అజాంకు ఆ తర్వాత సొంత దేశంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ సిరీస్ లను కోల్పోవడం పెద్ద అవమానంగా మారింది. తాజాగా దీన్ని మరింత పెంచుతూ బాబర్ అజాం వ్యక్తిగత వీడియోలు మరియు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరింతగా వివాదంలో చిక్కుకున్నాడు.

ఒక పేరడీ ఖాతా ద్వారా చేసిన ట్విట్టర్ పోస్ట్‌లో బాబర్ ఒక అమ్మాయితో శృంగారం చేస్తున్నట్టు ఆరోపించిన వీడియో లీక్ అయ్యింది. అతని ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే వీడియో యొక్క ప్రామాణికత ధృవీకరించబడలేదు.
బాబర్‌కు సంబంధించిన వైరల్ వీడియో నెటిజన్లలో కలకలం రేపింది. అతని అభిమానులు కొందరు ఇది అతని ఇమేజ్‌ను పాడుచేయడానికి బాబర్‌పై జరిగిన కుట్ర అని పేర్కొన్నారు. మరికొందరు వీడియో మార్ఫింగ్ చేయబడిందని.. స్టార్ బ్యాటర్‌పై అసత్య ప్రచారం చేయవద్దని కోరారు.
“వీడియో ఎవరో ఎడిట్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అతని పెదవుల కదలిక లేదు. కానీ అతను వినయంగా ఉంటాడని.. ఈ రకమైన సిగ్గుచేటు చర్యలు చేయడని మాకు తెలుసు.” అని కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. “బాబర్ ఆజం లీక్ అయిన ఫోటో గురించి రచ్చ ఏమిటి? అలాగే, ప్రజలు తమలో ఏదైనా మర్యాద మిగిల్చినట్లయితే, దానిని వ్యాప్తి చేయడం మానుకోవాలి, ”అని మరొక నెటిజన్ కామెంట్ చేశారు. మీరు అలా ఎలా చెప్పగలరు? నీ దగ్గర ఏదైనా రుజువు ఉందా?” ఒక వినియోగదారు పోస్ట్‌పై వ్యాఖ్యానించారు.

ఎవరి వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోకండి, ఆ వీడియో ఫేక్ అని ఎవరికి తెలుసు, ”అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోతో బాబర్ అజాం తీవ్ర చిక్కుల్లో పడిపోయాడు.