Tamannaah- Vijay Varma: హీరోయిన్ గా తమన్నా లాంగ్ కెరీర్ కలిగి ఉంది. ఆమె పరిశ్రమకు వచ్చి దాదాపు 17 ఏళ్ళు అవుతుంది. ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో తమన్నా మీద ఎఫైర్స్ రూమర్స్ పెద్దగా వచ్చిన దాఖలాలు లేవు. అయితే గత కొన్ని రోజులుగా ఆమె నటుడు విజయ్ వర్మను ప్రేమిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమన్నా-విజయ్ వర్మ తరచుగా కలవడం, వేడుకల్లో పాల్గొనడం చేస్తున్నారు. ఎక్కడికెళ్లినా ఒకరినొకరు వీడటం లేదు. ఈ క్రమంలో తమన్నా-విజయ్ వర్మ ఎఫైర్ నిజమే కావచ్చన్న వాదన మొదలైంది.

ఓ పక్క పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండగా మరో ఈవెంట్ కి తమన్నా-విజయ్ వర్మ కలిసి హాజరయ్యారు. తమన్నా ఎల్లే గ్రాడ్యుయేట్స్ 2022 మ్యాగజైన్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ కి విజయ్ వర్మ కూడా వెళ్లారు. ఇద్దరు జంటగా కెమెరాకు ఫోజులిచ్చారు. అలాగే తమన్నా ఎఫైర్ రూమర్స్ ఖండించలేదు. సాధారణంగా తమన్నా తనపై వచ్చే పుకార్లకు స్పష్టత ఇస్తారు. మీడియా ముఖంగా లేదా సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. విజయ్ వర్మతో ఎఫైర్ అంటూ వరుస కథనాలు వెలువడుతుండగా… తమన్నా ఖండించడం కానీ సమర్ధించడం కానీ చేయలేదు.
వరుస పరిణామాల నేపథ్యంలో తమన్నా… తాను రిలేషన్ లో ఉన్నట్లు చెప్పకనే చెప్పిందని అంటున్నారు. ఇంతకంటే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. కాగా తమన్నా-విజయ్ వర్మ జంటగా లస్ట్ స్టోరీస్ 2 యాంథాలజీ సిరీస్లో నటిస్తున్నట్లు సమాచారం. ఇక విజయ్ వర్మ తెలుగులో ఒకే ఒక్క చిత్రం చేశారు. నాని హీరోగా విడుదలైన ‘ఎం సీ ఏ’ చిత్రంలో విలన్ రోల్ చేశారు. విజయ్ వర్మ తెలుగు ప్రేక్షకులకు తెలిసింది తక్కువే.

తమన్నా ని వివాహం చేసుకునేందుకు పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు, సినిమా స్టార్స్ పోటీపడుతున్నారని తెలుస్తుంది. అయితే ఆమె అనూహ్యంగా విజయ్ వర్మ ప్రేమలో పడ్డారనిపిస్తుంది. మరి ప్రేమ అంటే అంతే కదా. దానికి వయసు, హోదా, కులం, మతం, పేద ధనిక తారతమ్యాలు ఉండవు. ఎప్పుడు, ఎవరిపై, ఎందుకు కలుగుతుందో చెప్పలేం. కాగా తమన్నా ఇంకా క్రేజీ ఆఫర్స్ పట్టేస్తూ జోరు చూపిస్తున్నారు. ఆమె ఖాతాలో చిరంజీవి భోళా శంకర్ ఉంది. దర్శకుడు మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేష్ చిరు చెల్లిగా కీలక రోల్ చేస్తున్నారు.