https://oktelugu.com/

Periods: ప్రతీ తల్లి తప్పకుండా కూతురికి చెప్పాల్సిన విషయాలు ఇవే!

ప్రతీ తల్లి కూడా కూతురుకి ఈ పీరియడ్స్ గురించి పూర్తి వివరంగా చెప్పాలి. రజస్వల అయిన తర్వాత ప్రతీ నెల రోజులకు పీరియడ్స్ వస్తాయని తల్లి ముందే చెప్పాలి. ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలని కూతురికి చెప్పాలి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 23, 2024 / 01:05 AM IST

    Periods

    Follow us on

    Periods: అమ్మాయిలకు పీరియడ్స్ అనేవి సాధారణం. అమ్మాయికి తొమ్మిది నుంచి పదేళ్లు వచ్చినప్పటికీ వారు రజస్వల అవుతారు. ఇలా పీరియడ్స్ అన్ని విషయాల గురించి అమ్మాయిలు కేవలం తల్లితో మాత్రమే మాట్లాడగలరు. ప్రతీ తల్లి కూడా కూతురుకి ఈ పీరియడ్స్ గురించి పూర్తి వివరంగా చెప్పాలి. రజస్వల అయిన తర్వాత ప్రతీ నెల రోజులకు పీరియడ్స్ వస్తాయని తల్లి ముందే చెప్పాలి. ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలని కూతురికి చెప్పాలి.

    ఏడు రోజుల కంటే ఎక్కువ రోజులు రక్తస్రావం అయితే అది ఆరోగ్యానికి మంచిది కాదని, వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని చెప్పాలి. ఈ పీరియడ్స్ సమయంలో కడుపులో నొప్పి, అధికంగా రక్తస్రావం, నడుం నొప్పి, కాళ్లు నొప్పులు వంటివి వస్తాయని చెప్పాలి. అలాగే కొన్నిసార్లు నెలసరి కూడా రాదని.. అది మన ఆహార అలవాట్ల మీద ఆధారపడి ఉంటుందని అమ్మాయిలకు చెప్పాలి. వీటితో పాటు పీరియడ్స్ సమయంలో ప్యాడ్స్‌ను ప్రతీ 8 గంటలకు మార్చాలని చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ పిల్లలకు తెలియవు. తల్లితో తప్పా ఇంకా ఎవరితో కూడా ఈ విషయాలు షేర్ చేసుకోలేరు.

    పీరియడ్స్ సమయంలోనే కాకుండా సాధారణంగా మంచి ఫుడ్ తీసుకోవాలని కూతురికి చెప్పాలి. సరిగ్గా ఫుడ్ తీసుకోకపోతే బ్లీడింగ్ ఎక్కువగా అయి రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఫుడ్ అనేది మానకూడదని అమ్మాయిలకు చెప్పాలి. అలాగే థైరాయిడ్, రక్తహీనత, పీసీఓడీ వంటి సమస్యలు ఉన్నా కూడా పీరియడ్స్ రావని పిల్లలకు చెప్పాలి. వీటితో పాటు మద్యం ఎక్కువగా సేవించడం, శారీరక వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా నెలసరి సరైన సమయానికి రాదు. వీటివల్లే నెలసరి సమయంలో పొత్తి కడుపు నొప్పి వస్తుంది.

    నెలసరి నొప్పిని తట్టుకోవడానికి సహజంగా చిట్కాలు పాటిస్తే పర్లేదు. కానీ మందులు వాడటం ఆరోగ్యానికి అంతమంచిది కాదని పిల్లలకు చెప్పాలి. అలాగే నెలసరి రాకుండా మందులు వంటివి వాడకూడదని కూతురికి చెప్పాలి. వీటివల్ల భవిష్యత్తులో పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతాయి. అలాగే విటమిన్-బి6, విటమిన్-సి, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం ఫైబర్ ఉండే వాటిని తీసుకోవాలి. వీటివల్ల నెలసరి నొప్పి తగ్గడంతోపాటు సరైన సమయానికి పీరియడ్స్ వస్తాయి. నెలసరి సమస్యల నుంచి విముక్తి చెందాలంటే యోగా, మెడిటేషన్‌తో పాటు వాకింగ్ చేయాలి.

    ఈ రోజుల్లో చాలా మంది తీసుకునే ఆహారం వల్ల నెలసరి సరిగ్గా కావడం లేదు. మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చాలా మంది పీరియడ్స్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీటి గురించి ప్రతీ విషయాన్ని కూతురికి తల్లి చెప్పాలి. అలాగే పీరియడ్స్ సమయంలో మూడ్ స్వింగ్స్ అనేవి మారుతుంటాయి. కాబట్టి వీటి గురించి కూడా అమ్మాయిలకు చెప్పాలి. ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచాలని చెప్పాలి. సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల నెలసరి కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. ఈ విషయాన్ని తప్పకుండా అమ్మాయిలకు చెప్పాలి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.