Peanut Allergy: కొందరికి కొన్ని పదార్థాలు తింటే అలెర్జీ ఉంటుంది. ఎలర్జీ ఉన్న పదార్థాలను వారు అసలు తినకూడదు. పొరపాటున తింటే వారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వేరుశెనగ కాయలు కూడా కొందరికి అలెర్జీ అంటా. పీనట్ అలెర్జీ ఉన్నవారు అసలు వీటిని తినకూడదు. పొరపాటున ఒక చిన్న ముక్క తిన్నా కూడా వెంటనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఓ యువతి ఇలానే మరణించింది. పీనట్ అలెర్జీ ఉన్న ఆ యువతికి తెలియక చిన్న ముక్క వేరుశెనగ తిన్నది. దీంతో ఆ యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణించింది. ఈ అలెర్జీ చాలా డేంజర్. చికిత్స తీసుకునేంత సమయం లేకుండానే మరణిస్తారు. ఈ అలెర్జీ ఉన్నవారు చిన్న ముక్క వేరుశెనగ తింటే వెంటే చర్మంపై దద్దర్లు, వాపు వంటివి వస్తాయి. అలాగే కడుపు నొప్పి, తిమ్మిరి, వికారం, వాంతులు, జీర్ణ సమస్యలు, ఊపిరి ఆడకపోవడం, శ్వాస తీసుకోవడం కష్టం, తల తిరడం, వెంటనే స్పృహ కోల్పోవడం అన్ని కనిపిస్తాయి. కొందరిలో ఇవేవి కనిపించకుండానే మరణిస్తారు. చాలా ప్రమాదకరమైన ఈ అలెర్జీ వస్తే ఇక ప్రాణాలు మీద ఆశ వదులుకోవాల్సిందే.
సాధారణంగా వేరుశెనగలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి. కానీ పీనట్ అలెర్జీ ఉన్నవారు అయితే మాత్రం అసలు వీటిని తీసుకోకూడదు. వీటిని డైరెక్ట్‌గా లేదా వీటితో తయారు చేసిన పదార్థాలను తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న ముక్క పొరపాటున తిన్న కూడా అక్కడిక్కడే మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఈ అలెర్జీ ఉన్నవారు జీవితాంతం వేరుశెనగను తినకపోవడమే దీనికి పెద్ద చికిత్స. ముందుగా తినడం మానేసి ఏ చికిత్స అయిన తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు. కొందరు వంటలు ఏవైనా చేస్తే వేరుశెనగ తక్కువగా వేశారని, అసలు టేస్ట్ తగలదని అన్నా కూడా తినవద్దు. ఏ విధంగా కూడా మీ నోటిలోకి వేరుశెనగ వెళ్లకూడదు. మీకు తెలియకుండా అయిన నోటిలోకి వేరుశెనగ వెళ్లిందంటే ఇంకా ఆ రోజే మీకు లాస్ట్ డే అనే విషయం గుర్తుపెట్టుకోండి.
పీనట్ అలెర్జీ సమస్య నుంచి బయట పడాలంటే రెండు నుంచి నాలుగు వారాలకు ఒకసారి ఒమాలిజుమాబ్ ఇంజెక్షన్‌లు వేయించుకోవాలి. ఈ సమస్య కోసం వైద్యుని సంప్రదిస్తే ఈ ఇంజెక్షన్‌తో చికిత్స చేస్తారు. ఈ ఇంజెక్షన్ వేయించుకోవడం వల్ల పొరపాటున మీరు వేరుశెనగ తిన్నా కూడా ప్రమాదం నుంచి కాపాడటానికి ఈ ఇంజెక్షన్ బాగా పనిచేస్తుంది. అలాగే ఓరల్ ఇమ్యునోథెరపీ కూడా చేస్తారు. దీనివల్ల మీ శరీరానికి ప్రొటీన్ అందుతుంది. దీంతో మీకు పీనట్ అలెర్జీ సమస్య తగ్గుతుంది. అలాగే సబ్లింగ్యువల్ ఇమ్యునోథెరపీని కూడా కొందరు వైద్యులు సూచిస్తారు. ఈ సమస్య చాలా ప్రమాదకరమైనది. దీని నుంచి బయటపడాలంటే చేయాల్సింది మొదటిగా వేరుశెనగలకు దూరంగా ఉండాలి. కాబట్టి వీటిని పూర్తిగా తినడం మానేస్తేనే సమస్య నుంచి ఈజీగా బయటపడతారు. లేకపోతే ప్రాణాలు కోల్పోతారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.