https://oktelugu.com/

Parenting: చలికాలంలో పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

కొందరు తెలియక చేసిన కొన్ని తప్పుల వల్ల పిల్లలు చలికాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏ కాలమైన పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అందులోనూ చలికాలమంటే తప్పకుండా తీసుకోవాలి. మరి ఈ కాలంలో పిల్లల విషయంలో తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 17, 2024 / 02:49 AM IST

    winter season

    Follow us on

    Parenting: తల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఒక్క క్షణం కూడా వాళ్లను వదిలిపెట్టకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటారు. పిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకున్న సరే.. వాళ్లకి ఏదో ఒకటి అవుతుంది. పిల్లలకు ఐదేళ్లు వచ్చే వరకు తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అయితే సీజన్ మారే కొలది పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా శీతాకాలం ప్రారంభం అవుతుందంటే పిల్లల విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే చలికాలంలో సాధారణంగా మనమే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. అలాంటిది పిల్లలు తట్టుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా అప్పుడే పుట్టిన పిల్లలు అయితే చెప్పక్కర్లేదు. వీరి చర్మం చాలా లేతగా ఉంటుంది. చలికి, వేడికి అంతగా తట్టుకోలేరు. అయితే కొందరు తెలియక చేసిన కొన్ని తప్పుల వల్ల పిల్లలు చలికాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏ కాలమైన పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అందులోనూ చలికాలమంటే తప్పకుండా తీసుకోవాలి. మరి ఈ కాలంలో పిల్లల విషయంలో తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

     

    చలికాలంలో పిల్లలకు గాలి తగలకుండా చూసుకోవాలి. వారికి బయట నుంచి వచ్చే చల్ల గాలి సోకకుండా జాగ్రత్త పడాలి. వారికి దుప్పటి లేదా స్వెటర్ వంటివి వేయాలి. అయితే కొందరు చలి వేయకుండా ఉండాలని బరువు దుప్పట్లను కప్పేస్తారు. ఇలా చేయకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే బరువు దుస్తులను పిల్లపై కప్పి ఉంచడం వల్ల వారికి కొన్నిసార్లు ఊపిరి ఆడదు. అలాగే వారు చేతులు, కాళ్లు కూడా కప్పలేరు. దీని వల్ల పిల్లలు అసౌకర్యంగా భావిస్తారు. కాబట్టి చలిని తట్టుకునే తక్కువ బరువు ఉండే దుప్పట్లను పిల్లలకు కప్పండి. పిల్లలకు వేసే లో దుస్తులు కూడా కాస్త దట్టంగా ఉండేవి వేయండి. చలికాలంలో అసలు కాటన్ దుస్తులు వేయవద్దు. వీటివల్ల బాడీ తొందరగా చల్లగా అయిపోతుంది. మార్కెట్లో లోదుస్తుల్లో కూడా స్వెటర్లు లభిస్తాయి. వీటిని పిల్లలకు వేయడం వల్ల వారికి వెచ్చగా ఉంటుంది.

     

    సాధారణంగా పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. తప్పకుండా వారి చర్మ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చలి కాలంలో వారి చర్మానికి ఏదైనా లోషన్, ఆయిల్ పూసినట్లయితే నెమ్మదిగా మాత్రమే పూయాలి. లేకపోతే చలికి వారి చర్మం మండుతుంది. అయితే చలికాలంలో పిల్లలకు రోజూ స్నానం చేయకూడదు. ఒకవేళ చేసిన కూడా కేవలం వేడి నీటితో మాత్రమే చేయాలి. లేకపోతే పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం, ఇన్ఫెక్షన్లు వంటివి సోకే ప్రమాదం ఉంది. ఈ కాలంలో పిల్లల పాదాలకు సాక్స్, చేతులకు గ్లౌజ్ వంటివి పెట్టండి. వీటివల్ల వారు చేతులు వెచ్చగా ఉంటాయి. అలాగే పిల్లలకు కొబ్బరి నూనె కాస్త నెమ్మదిగా మసాజ్ చేయండి. దీనివల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా పిల్లలను ఈ కాలంలో రోజూ 10 నిమిషాల పాటు ఎండలోకి తీసుకెళ్లండి. అది కూడా ఉదయం పూట మాత్రమే తీసుకెళ్లడం వల్ల ఆరోగ్యానికి మంచిది. దీనివల్ల పిల్లలకు విటమిన్ డి అందడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.